ఛార్మి ప్రధాన పాత్రలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్, శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకాలపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘జ్యోతిలక్ష్మీ’. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను ప్రశ్నించడంతో ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ను వంశి ఇంటర్నేషనల్ సంస్థ అభినందించింది. ఈ సందర్భంగా....
నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ "ఈ చిత్రం నేటి మహిళలపై జరుగుతున్న వివక్షతను తెలియజేస్తుంది. ఛార్మి తన పాత్రలో ఒదిగిపోయింది. తన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కర్తవ్యం, ప్రతిఘటన సినిమాలో విజయశాంతిల నటించింది. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన సి.కళ్యాన్ గారికి దర్శకుడు పూరిజగన్నాథ్ గారికి నా అభినందనలు" అని చెప్పారు.
సి.కళ్యాన్ మాట్లాడుతూ "నేను సుమారుగా యాబై చిత్రాలను నిర్మించాను. నేను నిర్మించిన 'చందమామ' చిత్రంతో ఎంత మంచి పేరొచ్చిందో జ్యోతిలక్ష్మి తో ఇంకా మంచి పేరొచ్చింది. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించినందుకు చాలా గర్వంగా ఉంది" అని చెప్పారు.
ఛార్మి మాట్లాడుతూ "ఓ నటిగా ఎన్ని చిత్రాల్లో నటించినా గుర్తింపు కొన్ని సినిమాలకు మాత్రమే వస్తుంది. అలాంటి చిత్రమే ఈ 'జ్యోతిలక్ష్మి'. ఇటువంటి మంచి చిత్రాన్ని తెరకెక్కించినందుకు పూరిజగన్నాథ్ గారికి నా థాంక్స్. ఈ చిత్రంతో ఆయన నాకు మరోసారి లైఫ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చిరంజీవి గారి సినిమాలో బిజీ గా ఉన్నారు. అందుకే ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. పూరి గారికి మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో హీరో సత్య, పి.వి.విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.