>మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ చిత్రం ‘బాహుబలి’ కోసం వెనక్కి వెళ్లిందనే వార్తలు వస్తున్నాయి. అయితే కేవలం ఈ చిత్రం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలా పెండిరగ్ ఉండటంతో మార్చి 7కి షిఫ్టింగ్ జరిగిందని సమాచారం. ఇదే విషయమై ఇంతకు ముందు ‘బాహుబలి’ నిర్మాత ‘శ్రీమంతుడు’ టీమ్‌కు థాంక్స్ చెప్పాడు. ఇక ‘శ్రీమంతుడు’ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఈ విషయమై మాట్లాడాడు. ఈ నేపథ్యంలో ఈ విషయమై రాజమౌళి మాట్లాడుతూ... మా తరపు నుండి జరిగిన పొరపాటేమిటంటే తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ వెర్షన్స్ కూడా చూసుకోవాలి. కర్ణాటకలోనూ అక్కడ సినిమాలు ఏం విడుదలవుతున్నాయో కూడా చూసుకోవాలి. అన్ని ఏరియాలు చూసుకొని జులై 10 మంచిదనుకొని ప్రకటించాం. అప్పటికే ‘శ్రీమంతుడు’ను జులై 17న విడుదల చేయాలని నిర్ణయించుకున్న సంగతి ఆ తర్వాతే మాకు తెలిసింది. దాంతో ఇలా జరిగిందేమిటబ్బా.. అనుకొన్నాం. నిజానికి మాకు వేరేచాయిస్ లేదు. వాళ్ల విడుదల తేదీ మాకు తెలిసినా మా ఇబ్బంది వాళ్లకు చెప్పి, వాళ్ల చేత ఆ పనే చేసుండేవాళ్లం. లక్కీగా వాళ్లకు కూడా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండిరగ్ ఉన్నాయి. వాళ్లకు ఫస్ట్ కాపీ రెడీగా ఉన్నట్లయితే మాకు పెద్ద సమస్య అయివుండేది. వాళ్లది పెద్ద సినిమా. అయినా వారికి ఫస్ట్‌కాపీ రావడానికి ఒకటిన్నర నెల టైమ్ కావాల్సివుండేది. అలా మాకు కలిసొచ్చింది. వాళ్లు కూడా మా పరిస్థితి అర్థం చేసుకొని వారి సినిమాని పోస్ట్‌పోన్ చేసుకున్నారు. బయట ఎన్ననుకుంటున్నా.. అంతర్గతంగా వాళ్లు మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం.. అని రాజమౌళి తేల్చిచెప్పాడు.