అగ్ర కథానాయిక అనుష్క టైటిల్ రోల్‌లో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణీి గుణ సమర్పణలో డైనమిక్ డైరెక్టర్ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి ద్విభాషా చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. విఎఫ్‌ఎక్స్ వర్క్ తుదిదశకు చేరుకుంది.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ ` ‘‘దేశ విదేశాల్లో ఈ చిత్రానికి సంబంధించిన సిజి వర్క్ జరుగుతోంది. ప్రస్తుతం విఎఫ్‌ఎక్స్ వర్క్ తుది దశలో వుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఈ చిత్రాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దే ప్రక్రియలో కాస్త డిలే అయిన కారణంగా ముందుగా చెప్పినట్టు జూన్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయలేకపోతున్నాం. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో వుండాలన్న ఉద్దేశంతో కొంత టైమ్ తీసుకోవడం జరిగింది. అతిత్వరలోనే మా ‘రుద్రమదేవి’ చిత్రం రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవిగారు వాయిస్ ఓవర్ చెప్పడం ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకు వుంది’’ అన్నారు.
రుద్రమదేవిగా అనుష్క నటించిన ఈ ప్రెస్టీజియస్ మూవీలో గోనగన్నారెడ్డిగా స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, రానా, కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్‌రాజ్, నిత్యమీనన్, కేథరిన్, ప్రభ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మీనన్, ప్రసాదాదిత్య, అజయ్, విజయ్‌కుమార్, వేణుమాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్, కృష్ణభగవాన్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శివాజీరాజా, సమ్మెట గాంధీ, ఆదితి చెంగప్ప, సన, రక్ష తదితర నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, ఆర్ట్: పద్మశ్రీ తోట తరణి, ఫోటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, కాస్ట్యూమ్ డిజైనర్: నీతా లుల్లా(జోధా అక్బర్ ఫేం), ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్. సూపర్‌వైజర్: కమల్ కణ్ణన్(ప్రసాద్ ఇ.ఎఫ్.ఎక్స్.), మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజయ్, కాస్ట్యూమ్స్: వి.సాయిబాబు, మేకప్: రాంబాబు, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామ్‌గోపాల్, సమర్పణ: శ్రీమతి రాగిణీ గుణ, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: గుణశేఖర్.