Advertisementt

అల్ల‌రోడు డ్రాప్ అయ్యాడా?

Tue 23rd Jun 2015 12:09 PM
allari naresh,sakshi chowdary,jamesbond movie,anil sunkara,jamesbond postponed,  అల్ల‌రోడు డ్రాప్ అయ్యాడా?
అల్ల‌రోడు డ్రాప్ అయ్యాడా?
Advertisement
Ads by CJ
`జేమ్స్‌బాండ్‌`తో ఈనెల 26న బాక్సాఫీసు ద‌గ్గ‌ర సంద‌డి చేయాల‌నుకొన్నాడు అల్ల‌రి న‌రేష్. ఆ మేర‌కు సినిమాని కూడా ప‌క్కాగా సిద్ధం చేశారు.  సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి. యు/ఎ స‌ర్టిఫికెట్ ల‌భించింది. అయితే ఏమైందో ఏంటో తెలియ‌దు కానీ... సినిమాకి సంబంధించిన  ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు ఆగిపోయాయి. `జేమ్స్‌బాండ్` ఈనెల 26న విడుద‌ల కావ‌డం లేద‌ని తెలిసింది. ఆ రోజు విడుద‌ల‌య్యే సినిమాలు బోలెడ‌న్ని ఉండ‌టంతో న‌రేష్ త‌ప్పుకోవ‌డ‌మే మేల‌ని ఫిక్స్ అయిన‌ట్టు తెలిసింది. అయితే త‌దుప‌రి  రిలీజ్ డేట్ ఎప్పుడ‌న్న‌ది మాత్రం ఇంకా ఖ‌రారు చేయ‌లేదు చిత్ర‌బృందం.  కొన్నాళ్లుగా వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఇబ్బందులు ప‌డుతున్న న‌రేష్ `జేమ్స్‌బాండ్‌`తో హిట్టు కొట్టి తీరాల‌న్న క‌సితో క‌నిపించాడు. శ‌ర‌వేగంగా సినిమాని చేసేశాడు. కానీ `బాహుబ‌లి`, `రుద్ర‌మ‌దేవి`లాంటి భారీ చిత్రాలు ఆయ‌న్ని భ‌య‌పెడుతున్నారు. థియేట‌ర్ల ద‌గ్గ‌ర ఒక‌ట్రెండు వారాల ఖాళీ స్లాట్ దొరికితే అల్ల‌రి న‌రేష్ త‌నివితీరా సంద‌డి చేయ‌డానికి ఆస్కార‌ముండేది. కానీ  భారీ చిత్రాలు వ‌రుస‌క‌డుతుండ‌టంతో అల్ల‌రి న‌రేష్‌లో మ‌ళ్లీ టెన్ష‌న్ మొద‌లైన‌ట్టు తెలుస్తోంది. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ