Advertisementt

'కాకతీయుడు' ఆడియో విడుదల..!

Tue 23rd Jun 2015 07:27 AM
  'కాకతీయుడు' ఆడియో విడుదల..!
'కాకతీయుడు' ఆడియో విడుదల..!
Advertisement
Ads by CJ

నందమూరి తారక్ రత్న, శిల్పా, యామిని, రేవతి నటీనటులుగా తెరకెక్కుతున్న చిత్రం 'కాకతీయుడు'. శ్రీ ఎల్.వి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై లగడపాటి వెంకాయమ్మ సమర్పణలో కె.వి.రామిరెడ్డి నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. విజయ సముద్ర దర్శకుడు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో పలువురు సినీ, రాజకీయనాయకుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పత్తిపాటి పుల్లారావు బిగ్ సిడిను ఆవిష్కరించారు. నటుడు రాజశేఖర్ ఆడియో సిడిలను విడుదల చేసారు. ఎస్.ఆర్.శంకర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో జివికె4 మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలయింది. ఈ సందర్భంగా..

పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ "రైతు కుటుంబం నుండి వచ్చిన లగడపాటి వెంకట్రావు గారు ఆయన కుమారుడ్ని నిర్మాతగా చేసి సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు సూపర్ హిట్ అవుతాయి. ట్రైలర్ బావుంది. తారకరత్న డైలాగ్స్  అధ్బుతంగా చెప్పాడు. సముద్ర గారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది" అని అన్నారు.

రాజశేఖర్ మాట్లాడుతూ "సముద్ర గారు నా కెరీర్ లో 'సింహరాశి' వంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చారు. ఆయనపై ఎంతో అభిమానం ఉంది. ఆయన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుంది. తారక్ లో చాలా టాలెంట్ ఉంది. కొంచెం లక్ కూడా తనకు ఫేవర్ చేస్తే స్టార్ హీరో అవుతాడు. ఈ సినిమాతో అద్రుష్టం కలిసొచ్చి తను మంచి సక్సెస్ ఫుల్ హీరో కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ "తారకరత్న డైలాగ్స్ బాగా చెప్తాడు. డాన్సులు, ఫైట్స్ అధ్బుతంగా చేస్తాడు. ఈ సినిమా ట్రైలర్ సాంగ్స్ చాలా బావున్నాయి. శంకర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సముద్ర చాలా కష్టపడే వ్యక్తిత్వం కలవాడు. సినిమా ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

దర్శకుడు విజయ సముద్ర మాట్లాడుతూ "ప్రభుత్వం ఉచిత విద్యా పథకాలతో పాటు పేద విద్యార్థులకు అన్ని స్కూల్లలోను, కాలేజీలలో 25% ఫీజులలో రాయితీ కలిపించాలని చాలా ఏళ్ళ క్రిందటే ప్రతిపాదించింది. కాని అవేవి అమలులోకి రాకపోగా పేద విద్యార్థులకు చదువుకునే అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఓ వ్యక్తి ఆ విషయాలపై  పోరాటం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాం. సినిమాలో ఆరు పాటలున్నాయి. తారక్ ఎనిమిది నెలలు కష్టపడి ఈ సినిమా కోసం తన శరీరాకృతి మార్చుకున్నాడు. ఈ చిత్ర కోసం పని చేసిన ప్రతి టెక్నీషియన్ కు నా కృతజ్ఞతలు" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఆర్.శంకర్ మాట్లాడుతూ "సముద్ర గారు చేసిన సినిమాతోనే నా కెరీర్ మొదలయ్యింది. ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందించే అవకాశం ఇచ్చారు. తారక్ గారి డాన్సులతో నా మ్యూజిక్ బాగా ఎలివేట్ అయింది. సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ సాదిస్తుంది" అని అన్నారు.

నిర్మాత లగడపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ " శంకర్ మణిశర్మ గారి శిష్యుడు. ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. 'చండీ' సినిమా తరువాత ఆయన ఈ చిత్రానికే మ్యూజిక్ చేసారు. తారక్ సినిమాలో అధ్బుతంగా నటించాడు. సముద్ర చాలా బాగా డైరెక్ట్ చేసాడు. జూలై చివరి వారంలో చిత్రాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.

హీరో తారక్ రత్న మాట్లాడుతూ "ఈ సినిమాలో నేను డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాను. ఒకటి బబ్లీ గా ఉండే పాత్రయితే మరొకటి సిక్స్ ప్యాక్ లో కనిపించే పాత్ర. ఇదొక కమర్షియల్ సినిమా. మంచి సందేశాత్మక చిత్రం. చాలా సంవత్సరాలుగా లగడపాటి శ్రీనివాస్ నేను కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఇప్పటికి సినిమా చేయడం కుదిరింది. ఫేషన్ తో కాకుండా ఈ సినిమాను ఓ ప్యాషన్ తో నిర్మించారాయన. సముద్ర గారు చాలా బాగా డైరెక్ట్ చేసారు. హీరోయిన్స్ ఇద్దరు అధ్బుతంగా నటించారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, టి.ప్రసన్న కుమార్, సాగర్, శోభారాణి, ఎరపతినేని శ్రీనివాస్, లగడపాటి వెంకట్రావు, హీరో శ్రీ, మలినేని లక్ష్మయ్య, శివరాం, బాస్కర్ గౌడ్, పొందూరి కాంతారావు, కామిరెడ్డి, చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కెమెరామెన్: పి.సహదేవ్, ఎడిటింగ్: నందమూరి హరి, కథ-మాటలు: మల్కార్ శ్రీనివాస్, నిర్మాత: లగడపాటి శ్రీనివాస్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విజయ సముద్ర.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ