Advertisementt

ఎన్టీఆర్‌కు తండ్రి, మామ సెట్‌ అయ్యారు!

Sun 21st Jun 2015 03:01 PM
jr ntr,sukumar,jagapathi babu,rajendra prasad,father and uncle  ఎన్టీఆర్‌కు తండ్రి, మామ సెట్‌ అయ్యారు!
ఎన్టీఆర్‌కు తండ్రి, మామ సెట్‌ అయ్యారు!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో భారీ చిత్రాల నిర్మాత బి.విఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఓ చిత్రం రూపొందించనున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్‌ షూటింగ్‌ను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వస్తున్న ఈ చిత్రానికి ‘మా నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్‌ను అనుకొంటున్నారట. కాగా ఇందులో ఎన్టీఆర్‌తో పాటు ఆయన తండ్రి, మామ పాత్రలకు ఇద్దరు ప్రముఖ నటులను ఖరారు చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్‌కు తండ్రిగా రాజేంద్రప్రసాద్‌, మామగా జగపతిబాబు నటించనున్నారట. ఇక జగపతిబాబుకు కూతురుగా... ఎన్టీఆర్‌కు జోడీగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటిస్తోంది. ఇందులో జగపతిబాబు పాత్ర నెగటివ్‌ షేడ్స్‌తో ఉంటుందని సమాచారం. కాగా ఈ చిత్రం జూన్‌ 29 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. తొలి షెడ్యూల్‌ను లండన్‌లో ప్లాన్‌ చేశారు. మరి ఈ తేదీన అయినా ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించుకుంటుందో లేదో వేచిచూడాల్సివుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ