Advertisementt

‘బాహుబలి’ స్టోరీ పాయింట్‌ రివీల్ చేశాడు!

Sun 21st Jun 2015 07:31 AM
bahubali,rana,bahubali story point,tamanna,bollywood  ‘బాహుబలి’ స్టోరీ పాయింట్‌ రివీల్ చేశాడు!
‘బాహుబలి’ స్టోరీ పాయింట్‌ రివీల్ చేశాడు!
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో దాదాపు 250కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో కూడా విడుదల చేయడానికి నిర్ణయించడంతో ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా బాలీవుడ్‌లో వేగవంతం చేశారు. రానా, తమన్నాలకు హిందీలో గుర్తింపు ఉండటంతో రాజమౌళి వారిపైనే తన దృష్టిని కేంద్రీకరించి ప్రమోషన్‌ను ముమ్మరం చేశాడు. కాగా ఓ ప్రమోషన్‌ కార్యక్రమంలో మాట్లాడిన రానా ‘బాహుబలి’ స్టోరీ పాయింట్‌ను రివీల్‌ చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘బాహుబలి’ స్టోరీని రెండు ముక్కల్లో చెప్పాలంటే... రాజ్యం కోసం ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన పోరాటమే ఈ చిత్రం స్టోరీ’ అని తెలిపాడు. గతంలో ఇదే పాయింట్‌ ఆదారంగా పలు సినిమాలు వచ్చినప్పటికీ ‘బాహుబలి’ ట్రీట్‌మెంట్‌ పరంగా, మేకింగ్‌ పరంగా సంచలనం సృష్టిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ