Advertisementt

'పాండవుల్లో ఒకడు' ఆడియో విడుదల..!

Sun 21st Jun 2015 06:40 AM
pandavullo okkadu,vaibhav,maruthi,nani,kodanda ramireddy  'పాండవుల్లో ఒకడు' ఆడియో విడుదల..!
'పాండవుల్లో ఒకడు' ఆడియో విడుదల..!
Advertisement

వైభవ్, సోనమ్ బాజ్వా జంటగా రూపొందిన తమిళ చిత్రం 'కప్పల్'. ఈ చిత్రాన్ని ఎస్.పిక్చర్స్ సమర్పణలో మారుతి టాకీస్ పతాకంపై తెలుగులో 'పాండవుల్లో ఒకడు' పేరుతో అనువదిస్తున్నారు. గొప్ప ప్రేమికుడు అనేది ఉప శీర్షిక. కార్తీక్ జి.క్రిష్ దర్శకుడు. మారుతి నిర్మాత. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్ లోని ఆవాస హోటల్ లో పలువురు చిత్ర ప్రముఖుల సమక్షంలో శనివారం సాయంత్రం జరిగింది. అతిథులందరూ బిగ్ సిడిని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరయిన నాని ఆడియో సిడిని ఆవిష్కరించి, తొలి సిడిను కోదండరామి రెడ్డికి అందజేశారు. అల్లరి నరేష్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.  నటరాజన్ శంకరన్ సంగీతం అందించిన ఈ ఆడియో మార్కెట్ లోకి విడుదలయ్యింది. 

బి.గోపాల్ మాట్లాడుతూ "తమిళంలో విడుదలైన ఈ చిత్రం పెద్ద హిట్టయ్యింది. తెలుగులో కూడా పెద్ద విజయం సాధించాలని కోరుతున్నాను. మారుతి విజయవంతమైన దర్శకుడు, నిర్మాత. ఆయనకు లాభాలు తీసుకురావాలి. కోదండరామిరెడ్డి గారి తనయుడు నటించిన ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి" అని అన్నారు. 

కోదండరామి రెడ్డి మాట్లాడుతూ "సినిమా అంతా వినోదాత్మకంగా ఉంటుంది. తమిళంలో ప్రివ్యూ చూసిన శంకర్ గారు, నిర్మాతలను పిలిచి తనే విడుదల చేస్తానన్నారు. ఐదేళ్ల తర్వాత శంకర్ చిత్రాన్ని కొని విడుదల చేశారు. పెద్ద విజయం సాధించింది. తెలుగు వెర్షన్ చూశా. డబ్బింగ్ చిత్రంలా అనిపించలేదు. స్ట్రెయిట్ చిత్రంలా ఉంటుంది. ఇక్కడ కూడా విజయం సాధించి మారుతికి మంచి లాభాలు రావాలి" అని అన్నారు.

నాని మాట్లాడుతూ "తెలుగులో యాక్షన్ ఫిల్మ్స్ తో వైభవ్ కెరీర్ స్టార్ట్ చేశాడు. అతని గురించి తెలిసినవాళ్ళు మంచి కామెడీ సినిమా చేస్తే బాగుండేది అనుకుంటారు. అలాంటి సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తెలుగులో మారుతి విడుదల చేస్తున్నారు. ఆయన కామెడీ టైమింగ్ తెలుసు. తమిళంలో ట్రైలర్ చూడగానే నచ్చింది. సినిమా చూడాలంటే తమిళం రాదు. సినిమా సక్సెస్ గురించి చాలా విన్నాను. తెలుగులో డబ్బింగ్ చేయడం సంతోషంగా ఉంది. తెలుగులో కూడా పెద్ద విజయం సాధించాలి" అన్నారు.

బొనమ్ కృష్ణ సతీష్ మాట్లాడుతూ "మారుతి గారితో వేరే సినిమాకు పని చేస్తున్నాం. ఆయన సలహాతో ఈ సినిమా చూసాం. చాలా బావుంది. తమిళంలో పెద్ద హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.  

అల్లరి నరేష్ మాట్లాడుతూ "తమిళంలో సినిమాను చూశాను. వైభవ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కామెడీ టైమింగ్ బావుంది. సినిమాలో చాలా మంది కమెడియన్స్ నటించారు. వారితో కలసి చాలా బాగా నటించాడు" అని అన్నారు. 

వైభవ్ మాట్లాడుతూ "చాలా రోజుల తర్వాత తెలుగులో నా సినిమా విడుదలవుతుంది. తమిళంలో పెద్ద విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఇక్కడ మారుతి విడుదల చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. 

మారుతి మాట్లాడుతూ "ఈ సినిమాను రీమేక్ చేయమని కొందరు అడిగారు. సినిమా చూసిన తర్వాత డబ్బింగ్ చేయడం మంచిదనుకున్నాం. డబ్బింగ్ తెలుగు సినిమాలా వచ్చింది. తెలుగులో మంచి ఫన్ ఉంటుంది. వైభవ్ డబ్బింగ్ బాగా చెప్పాడు. ప్రేమిస్తే తర్వాత మరోసారి శంకర్ గారి సమర్పణలో సినిమా విడుదల చేస్తున్నాం. తెలుగు కాపీ చేశాను. బాగా వచ్చింది" అన్నారు.   

ఇంకా ఈ కార్యక్రమంలో సొనమ్ బాజ్వా, మాజీ ఎంపి జి.రామయ్య, ఎమ్మెల్యే ఎస్వీ నాయుడు, గంగా నాయుడు, సహా నిర్మాతలు సతీష్ కృష్ణ, మల్లిపూడి రాంజి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాజేష్ పులి తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి ఆర్ట్: కె.ఆరుసామి, ఎడిటింగ్: ఆంటోని, సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజేష్ పులి, కో ప్రొడ్యూసర్: బొనమ్ కృష్ణ సతీష్, మల్లి పూడి రామ్ జీ, నిర్మాత: మారుతి, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం:కార్తిక్ జి.క్రిష్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement