ప్రముఖ సినీ నటి, నాయకురాలు కవిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురికావడంతో కవితకు గాయాలయ్యాయి. జగ్గయ్యపేట వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ కంటెయినర్‌న్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ కవితను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. సీనియర్ ఆర్టిస్ట్‌గా, టీడీపీ నాయకురాలిగా సుపరిచితమైన కవిత ప్రమాదానికి గురయ్యారన్న వార్త విని అటు సినీ అభిమానులు, టీడీపీ నాయకులు కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే ఆమెకు ప్రాణాపాయం లేదన్న సంగతి తెలుసుకొని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.