థాయ్‌లాండ్ షెడ్యూల్‌కి వెళ్లేలోపు మీకో వీడియోని చూపిస్తానంటూ అఖిల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. అది చూసి అభిమానులంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అఖిల్ నటిస్తున్న సినిమాకి సంబంధించి టీజర్‌లాంటిదేమైనా చూపిస్తాడేమో అని ఎక్స్‌పెక్ట్ చేశారు. రోజూ ట్విట్టర్ ఓపెన్ చేసి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు రేపు ఉదయం 10 గంటలకు ఆ వీడియోని విడుదల చేయబోతున్నాడట అఖిల్. ఆ విషయాన్ని నితిన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. అయితే అందరూ ఆశపడినట్టుగా ఆ వీడియో టీజరేమీ కాదు. వర్కింగ్ వీడియో అట. ఇటీవల స్పెయిన్ షెడ్యూల్‌కి సంబంధించిన మేకింగ్ వీడియోని విడుదల చేయబోతున్నారు. మరి అదెలా ఉంటుందో చూడాలి. వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి ప్రొడక్షన్ ఎ అని నామకరణం చేశాడు నితిన్. ఆయనే ఈ చిత్రానికి నిర్మాత. నితిన్ పూర్తిస్థాయిలో అఖిల్ సినిమాపైనే దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.