Advertisementt

'సాహసం సేయరా డింభకా' ఆడియో విడుదల..!

Sat 20th Jun 2015 05:14 AM
sahasam seyara dimbaka,sree,thirumala shetty kiran,ms reddy  'సాహసం సేయరా డింభకా' ఆడియో విడుదల..!
'సాహసం సేయరా డింభకా' ఆడియో విడుదల..!
Advertisement

శ్రీ, హమీద, సమత, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో హంస వాహిని టాకీస్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘సాహసం సేయరా డింభకా’. తిరుమల శెట్టి కిరణ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎమ్‌.ఎస్‌.రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినిమాటోగ్రఫిక్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆడియో లాంచ్ చేసారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా..

తలసానిశ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ "ప్రేక్షకులంతా పెద్ద సినిమాలను మాత్రమే చూస్తున్నారు. చిన్న సినిమాలను కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న చిత్రానికైనా వందలాది మంది టెక్నీషియన్స్ పని చేస్తారు. ఎందరో కళాకారులు సినిమాలపై ఆదారపడి బ్రతుకుతున్నారు. గతంలో ఉన్న కళాకారులను ఆదరించడానికి 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' తనవంతు సహకారాన్ని అందిస్తుంది. ప్రభుత్వం కూడా తెలుగు చలన చిత్ర పరిశ్రమను అభివృద్ధి పరచడానికి అన్ని రకాలా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో చూసుకుంటే రామారావు గారు, నాగేశ్వరావు గారు, కృష్ణ గారు నటించిన చిత్రాలన్నీ కుటుంబాలకు, అనుబంధాలకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలే.  కాని ప్రస్తుతం అందరు క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు. 'సాహసం సేయరా డింభకా' కూడా డిఫరెంట్ స్టైల్ లో ఉండే మూవీ. ఓ అబ్బాయి దయ్యాన్ని ప్రేమించే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను''అని చెప్పారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "ఎమ్.ఎస్.రెడ్డి గారు నాకు, రామసత్యనారాయణ గారికి మంచి మిత్రుడు. కొన్నేళ్ళ క్రితం రేలంగి గారితో కలిసి సాహసం సేయరా డింభకా అనే చిత్రంలో నటించాను. చాలా కాలం తరువాత అదే పేరుతో మరో చిత్రం రావడం, దానిని ఎమ్.ఎస్.రెడ్డి గారు నిర్మించడం ఆనందంగా ఉంది. చిన్న సినిమాలకు మంచి ఊతం రావాలని కోరుకునే వ్యక్తుల్లో నేనొకడిని. ఈ సినిమా మంచి సక్సెస్ ను పొందాలని ఆశిస్తున్నాను. ఇక ఈ సినిమా విషయానికొస్తే మనుషుల్ని ప్రేమిస్తేనే ఎన్నో బాధలు పడుతున్నాం. ఇక దయ్యాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. అందరు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ "నిర్మాత ఎంతో సాహసం చేసి మంచి సినిమా చేసారు. తలసానిశ్రీనివాస్ గారు ఇలాంటి చిన్న సినిమాలను సపోర్ట్ చేసి అందరికి బరోస కల్పిస్తున్నారు. ఈ చిత్రానికి పర్సంటేజ్ విధానాలలో థియేటర్స్ ఇప్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను" అని చెప్పారు.

దర్శకుడు తిరుమల శెట్టి కిరణ్ మాట్లాడుతూ "విభిన్నమైన పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఓ అమాయకుడైన అబ్బాయికి ఫారెస్ట్ లో నైట్ డ్యూటీ చేసే ఉద్యోగం వస్తుంది. అక్కడ ఓ దయ్యం అతనిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంటుంది. ఇలాంటి అంశాలతో సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. ఈ చిత్రం సెకండ్ హాఫ్ లో యాబై నిమిషాల పాటు షకలక శంకర్ చేసే హిలారియాస్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుంది. నాపై నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్‌. ఫుల్ మీల్స్ కామెడీ చిత్రమిది. జూలై నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.

నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ "సినిమాని కిరణ్ బాగా డైరెక్ట్‌ చేశాడు. శ్రీవసంత్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. జూలై నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.

హీరో శ్రీ మాట్లాడుతూ "ఈ కథ వినగానే కిరణ్‌ని నువ్వే డైరెక్ట్‌ చేయాలని చెప్పాను. అనుకున్నట్లే తను సూపర్‌గా డైరెక్ట్‌ చేశాడు. శ్రీవసంత్‌ మంచి ట్యూన్స్‌, బ్యాగ్రౌండ్‌స్కోర్‌ ఇచ్చారు. ఒక పిరికివాడిని దయ్యం ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆదిలాబాద్ ఫారెస్ట్ లో ఈ చిత్ర షూటింగ్ నిర్వహించాం. సినిమా హిలారియాస్ గా ఉంటుంది. మేము అడిగిన వెంటనే స్పెషల్ సాంగ్ లో  నటించడానికి అంగీకరించిన ఆలీ గారికి థాంక్స్. ఆడియో, సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్ మాట్లాడుతూ "ఈ సినిమాకు మ్యూజిక్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అవుట్ పుట్ బాగా వచ్చింది. రీరికార్డింగ్ కంప్లీట్ అయింది. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది" అని చెప్పారు.

హీరోయిన్స్ హమిద, సమత మాట్లాడుతూ "సినిమాను అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వేణుగోపాలచారి, సుధాకర్ కోమాకుల, రామసత్యనారాయణ, జ్యోతి, నిర్మల్ రాణి, చిత్ర నటీనటులు తదితరులు పాల్గొన్నారు. 

శ్రీ, హమీద, సమత, షకలక శంకర్, జబర్దస్త్ అప్పారావు, ఆలీ, జ్యోతి, పూర్ణిమ, రాజబాబు, గీతాంజలి ముఖ్యపాత్రదారులు.

కెమెరా: యోగి, శివ కె.నాయుడు, సంగీతం: శ్రీవసంత్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత: ఎమ్.ఎస్.రెడ్డి, రచన-దర్శకత్వం: తిరుమల శెట్టి కిరణ్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement