బలుపు, పవర్ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, తమన్నా, రాశి ఖన్నాలు హీరోయిన్స్ గా, రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'బెంగాల్ టైగర్'. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ఉత్తమాభిరుచితో చిత్రాల్ని నిర్మించిన నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విజయవంతంగా రామెజిఫిల్మ్ సిటిలో రామ్‌లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫిలో యాక్షన్ సన్నివేశాలు రామెజిఫల్మ్‌సిటి లో జరుగుతుంది.ఈ సన్నివేశాలు ఫాంటమ్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. కంటిన్యూగా జరుగుతున్న ఈ షెడ్యూల్ జులై మెదటివారం వరకూ జరుగుతుంది. జూన్20 నుండి బోమన్ ఇరాని కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గోంటారు..
నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ" మా బ్యానర్ లో మాస్‌మహరాజ్ రవితేజ, తమన్నా, రాశిఖన్నా లు జంటగా నిర్మిస్తున్న చిత్రం 'బెంగాల్ టైగర్'. సంపత్ నంది దర్శకుడు. బోమన్ ఇరానితో పాటు రావు రమేష్, షియాజి షిండే, నాజర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదితరులు నటిస్తున్నారు. విజయవంతంగా రామోజిఫిల్మ్ సిటి లో నాన్‌స్టాప్ గా షూటింగ్ జరుగుతుంది.రామెజిఫిల్మ్ సిటిలో రామ్‌లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫిలో యాక్షన్ సన్నివేశాలు జరుగుతుంది.కంటిన్యూగా జరుగుతున్న ఈ షెడ్యూల్ జులై మెదటివారం వరకూ జరుగుతుంది. జూన్ 20 నుండి బోమన్ ఇరాని కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గోంటారు. హీరో రవితేజ, బ్రహ్మనందం గారి కాంబినేషన్ వచ్చే ప్రతి సన్నివేశం ఎంటర్‌టైన్ చేస్తాయి. గెస్ట్ పాత్రల్లో హర్షవర్దన్ రానే, అక్ష నటిస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది చాలా బాగా తీస్తున్నాడు. రవితేజ గారి ఎనర్జిలెవెల్ మా చిత్రం టైటిల్ బెంగాల్ టైగర్ జస్టిఫికేషన్ చేసేలా వుంటుంది. ఇప్పుడు తీస్తున్న యాక్షన్ సన్నివేశాల్ని ఫాంటమ్ కెమారాతో తీస్తున్నాము. ఈ యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి. ఈ చిత్రానికి యంగ్ ఎనర్టిటిక్ టాలెంటెడ్ తొ మ్యూజిక్ చేయిస్తున్నాము. ఈ వివరాలు త్వరలో తెలియజేస్తాము. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్న మా బెంగాల్ టైగర్ ని వినాయక చవితి సందర్బంగా విడుదల చేస్తున్నాము." అని అన్నారు.
దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ" మాస్ మహరాజ్ రవితేజ చిత్రం అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఎలా వుంటాయో మా బెంగాల్ టైగర్ చిత్రం అలానే వుంటుంది. రవితేజ గారి ఎనర్జి స్క్రీన్ మీద ఎలా ఆడియన్స్ చూడాలనుకుంటారో అదే రేంజిలొ చిత్రాన్నిచేస్తున్నాం.. ఉత్తమాభిరుచున్న కె కె రాధామోహన్ గారు నిర్మాత. బోమన్ ఇరాని జూన్ 20నుండి చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాల్లో పాల్గొంటారు. తమన్నా, రాశిఖన్నా చాలా అందంగా కనిపిస్తారు. రామ్‌లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫిలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఇవన్ని ఫాంటమ్ కెమారాతో చిత్రీకరిస్తున్నాము.ఈ యాక్షన్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి.ఇక రవితేజ గారు, బ్రహ్మనందం గారు కలిస్తే ఆడియన్స్ నవ్వులకి కొదవుండదు ఈ షెడ్యూల్ జులై మెదటి వారం వరకూ శరవేగంగా జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వినాయక చవితికి విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము." అని అన్నారు.
ఈ చిత్రలో మాస్‌మహరాజ్ రవితేజ, తమన్నా, రాశిఖన్నా, బోమన్ ఇరాని, బ్రహ్మనందం, రావు రమేష్, షియాజి షిండే, నాజర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, హర్హవర్ధన్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష, శ్యామల, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదితరులు ఈ షెడ్యూల్ లో నటించగా..
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్, కెమోరా: సుందర్ రాజన్, ఎడిటర్: గౌతమ్‌రాజు, ఆర్ట్: డి,వై.సత్యనారాయణ, ఫైట్స్: రామ్-లక్ష్మణ్,
నిర్మాత:కె.కె.రాధామెహన్,
కథ-మాటలు-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం:సంపత్ నంది