Advertisementt

‘రుద్ర ఐపిఎస్‌’ షూటింగ్‌ ప్రారంభం..!

Fri 19th Jun 2015 06:13 AM
rudhra ips,rajkrishna,keerthi podhval,rajasekhar reddy  ‘రుద్ర ఐపిఎస్‌’ షూటింగ్‌ ప్రారంభం..!
‘రుద్ర ఐపిఎస్‌’ షూటింగ్‌ ప్రారంభం..!
Advertisement
Ads by CJ

రాజ్‌కృష్ణ హీరోగా కీర్తన పొద్వాల్‌ హీరోయిన్‌గా అజిత్‌ క్రియేషన్స్‌ పతాకంపై టి.కృష్ణవేణమ్మ సమర్పణలో అంజన్‌కుమార్‌ చెరుకూరి దర్శకత్వంలో టి. రాజశేఖరరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రుద్ర ఐపిఎస్‌’. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక జూన్‌ 19న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకుడు దేవిప్రసాద్‌ క్లాప్‌నివ్వగా దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. మొదటి సన్నివేశానికి సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో, నిర్మాత రాజ్ కృష్ణ మాట్లాడుతూ ‘'ఇప్పటి వరకు కన్‌స్ట్రక్షన్‌ రంగంలో వున్నాను. సినిమా మీద వున్న ఆసక్తితో తొలిసారిగా హీరోగా నటిస్తూ.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. మంచి కథతో మా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’' అని అన్నారు.

దర్శకుడు అంజన్‌కుమార్‌ చెరుకూరి మాట్లాడుతూ '‘దర్శకుడుగా తొలి చిత్రమిది. కథ విన్న వెంటనే నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారు. కథ విషయానికి వస్తే రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. భానుచందర్‌ నిజాయితీ గల పొలిటీషియన్‌గా నటిస్తుండగా, సత్యప్రకాష్‌ విలన్‌గా నటిస్తున్నారు. హీరో రాజ్‌కృష్ణ అవినీతిని, అక్రమాలను అరికట్టే పవర్‌ఫుల్‌ ఐపిఎస్‌ రోల్‌లో రుద్రగా నటిస్తున్నారు. స్క్రీన్‌ప్లే బేస్డ్‌ చిత్రమిది. ఐదు పాటలుంటాయి. జూలై 1 నుంచి షూటింగ్‌ ప్రారంభించి సెప్టెంబర్‌లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. టీమ్‌ అందరి సహకారం బాగుంది’' అని అన్నారు.

భానుచందర్‌ మాట్లాడుతూ '‘ఈ సినిమాలో నిజాయితీ గల పొలిటీషియన్‌గా ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. తొలి ప్రయత్నం చేస్తున్న ఈ దర్శక నిర్మాతలకు విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను'’ అన్నారు.

సంగీత దర్శకుడు వి.ఆర్‌. మూర్తి మాట్లాడుతూ '‘ఇందులో ఐదు పాటలున్నాయి. ఒక పాట రికార్డింగ్‌ పూర్తయింది. అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌’ అన్నారు.

హీరోయిన్‌ కీర్తన పొద్వాల్‌ మాట్లాడుతూ '‘కన్నడలో రెండు చిత్రాల్లో నటించాను. తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇది. ఈ చిత్రం పెర్ఫార్మన్స్ కు స్కోప్‌ వున్న క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడం ఆనందంగా వుంది’' అని అన్నారు.

నటుడు సత్యప్రకాష్‌ మాట్లాడుతూ '‘దర్శకుడు కథ చెప్పగానే చాలా ఇంప్రెస్‌ అయ్యాను. ఇంతవరకు చేయని విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాను. టైటిల్‌లాగే సినిమా కూడా చాలా పవర్‌ఫుల్‌గా వుంటుంది.  చిత్ర యూనిట్‌ సభ్యులకు ఆల్‌ ది బెస్ట్‌’' అని అన్నారు. 

సమర్పకురాలు టి.కృష్ణవేణమ్మ, కెమెరామెన్‌ వంశీకృష్ణ, ఎడిటర్‌ నందమూరి హరి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాజ్‌కృష్ణ, కీర్తన పొద్వాల్‌, భానుచందర్‌, సత్యప్రకాష్‌, కృష్ణభగవాన్‌, విజయరంగరాజు, గుండు సుదర్శన్‌, రావిపల్లి రాంబాబు, అపూర్వ, మాధవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: విజయకృష్ణ, స్టంట్స్‌: మార్షల్‌ రమణ, ఎడిటర్‌: నందమూరి హరి, సంగీతం: వి.ఆర్‌.మూర్తి, డిఓపి: వంశీకృష్ణ పి., సమర్పణ: టి.కృష్ణవేణమ్మ, నిర్మాత: టి.రాజశేఖరరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే ` మాటలు ` దర్శకత్వం: అంజన్‌కుమార్‌ చెరుకూరి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ