Advertisementt

'అసుర' మూవీ సక్సెస్ మీట్..!

Thu 18th Jun 2015 09:53 PM
asura movie,success meet,nara rohit,krishna vijay,shyam deva bhakthuni  'అసుర' మూవీ సక్సెస్ మీట్..!
'అసుర' మూవీ సక్సెస్ మీట్..!
Advertisement

నారా రోహిత్, ప్రియా బెనర్జీ జంటగా నారా రోహిత్ సమర్పణలో దేవాస్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్, కుషాల్ మీడియా, ఆరన్ మీడియా వర్క్స్ పతాకాలపై కృష్ణ విజయ్ దర్శకత్వంలో శ్యామ్ దేవా భక్తుని, కృష్ణ విజయ్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'అసుర'. జూన్ 5న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో చిత్రబృందం సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా రోహిత్, కృష్ణ విజయ్, శ్యామ్ దేవా భక్తుని, ధర్మేంద్ర కాకరాల, సాయికార్తిక్, మురళి కొండేటి, సత్య, రవివర్మ, రామారావు, రూపాదేవి, సుబ్బరాయ శర్మ, కృష్ణకాంత్, నరసింహ, రుద్రప్రకాష్, బి.ఎస్.రాజు, మల్లేశ్వర్, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత శ్యామ్ దేవా భక్తుని మాట్లాడుతూ "ఈ సినిమాలో నారా రోహిత్ డబుల్ ఎనర్జీతో వర్క్ చేసాడు. మేము అడిగిన వెంటనే మాతో సినిమా చేయడానికి అంగీకరించిన రోహిత్ కు నా థాంక్స్. టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు ఎంతగానో సహకరించారు. విజయ్ కు స్క్రిప్ట్ పై క్లారిటీ ఉంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. మేము సినిమా చేసింది డబ్బు కోసం కాదు. టాలెంటెడ్ పర్సన్స్ ఎక్కడున్నా అవకాశాలు ఇస్తాం. నేను, రోహిత్, విజయ్ కలిసి మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నాం. 'అసుర' ను ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

దర్శకుడు కృష్ణవిజయ్ మాట్లాడుతూ "ఒక మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే నారా రోహిత్ లేకపోతే అసుర లేదు. టీమ్ అందరు ఎఫర్ట్ పెట్టి చేసారు. టెక్నీషియన్స్ అంతా సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళారు. అవుట్ పుట్ చూసి చాలా ఆనందంగా ఉంది" అని చెప్పారు.

హీరో నారా రోహిత్ మాట్లాడుతూ "అసుర సినిమా చూసి మంచి సినిమా కాని డబ్బులు రావని చెప్పారు. కాని మా సినిమాకు లాబాలొచ్చాయి. విజయ్ లేకపోతే నా పాత్ర ఇలా ఉండేది కాదు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు" అని చెప్పారు.

సాయికార్తిక్ మాట్లాడుతూ "అసుర మూడవ వారంలోకి ఎంటర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. రోహిత్ గారితో బ్యాక్ టు బ్యాక్ పని చేసే అవకాశాలు వస్తున్నాయి. విభిన్నమైన కాన్సెప్ట్స్ ను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు" అని చెప్పారు.

రవివర్మ మాట్లాడుతూ "పెర్ఫార్మన్స్ కు చాలా స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా థాంక్స్. నారా రోహిత్ గారితో వర్క్ చేయడం చాలా నచ్చింది. మంచి నటుడు" అని చెప్పారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement