Advertisementt

అతని కాన్‌సన్‌ట్రేషన్‌ అంతా ఆ రీమేక్‌ పైనే.!

Thu 18th Jun 2015 03:58 AM
hero sudheer babu,sudheer babu in varsham remake,sudheer babu in hindi movie,sudheer babu as villain  అతని కాన్‌సన్‌ట్రేషన్‌ అంతా ఆ రీమేక్‌ పైనే.!
అతని కాన్‌సన్‌ట్రేషన్‌ అంతా ఆ రీమేక్‌ పైనే.!
Advertisement
Ads by CJ

ఏమాయ చేసావె చిత్రంతో నటుడుగా పరిచయమైన సుధీర్‌బాబు ఆ తర్వాత ఎస్‌ఎంఎస్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన పెర్‌ఫార్మెన్స్‌తో ఓకే అనిపించుకున్నాడు. ప్రేమకథా చిత్రమ్‌తో మంచి పెర్‌ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్న సుధీర్‌ ఆమధ్య వచ్చిన ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ చిత్రం కోసం కండలు పెంచినా ఆ సినిమా వర్కవుట్‌ అవ్వకపోవడంతో కండలు చూపించే పని మానుకున్నాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లతో సినిమాలు చెయ్యడంలో ఉత్సాహం చూపిస్తున్న సుధీర్‌ను ఇటీవల విడుదలైన ‘మోసగాళ్ళకు మోసగాడు’ నిరాశపరిచింది. అయితే అనుకోకుండా అతనికి ఓ బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. ప్రభాస్‌, త్రిష జంటగా శోభన్‌ దర్శకత్వంలో యం.యస్‌.రాజు నిర్మించిన ‘వర్షం’ చిత్రాన్ని హిందీలో సాజిద్‌ నాడియాద్‌వాలా రీమేక్‌ చేస్తున్నాడు. ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న షబ్బీర్‌ఖాన్‌ కొన్ని సీన్స్‌ని సుధీర్‌తో చేయించి ఫుల్‌గా శాటిస్‌ఫై అయ్యాడట. తెలుగులో గోపీచంద్‌ చేసిన విలన్‌ క్యారెక్టర్‌ని హిందీలో సుధీర్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ చిత్రం కోసం కసరత్తులు చేస్తున్నాడు. జాకీ ష్రాఫ్‌ తనయుడు టైగర్‌ ష్రాఫ్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా, శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా చేస్తోంది. తన కెరీర్‌ స్టార్టింగ్‌లోనే ఒక బాలీవుడ్‌ సినిమాలో విలన్‌గా నటించే అవకాశం రావడంతో అతని ఆనందానికి హద్దులు లేకుండా పోయిందట. ప్రస్తుతం అతని కాన్‌సన్‌ట్రేషన్‌ అంతా ఈ రీమేక్‌పైనే వుందట. మరి మన కండల హీరో బాలీవుడ్‌లో ఎలాంటి పేరు తెచ్చుకుంటాడో వెయిట్‌ అండ్‌ సీ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ