Advertisementt

సంపూ సినిమా యూట్యూబ్‌లోకి!

Thu 18th Jun 2015 03:02 AM
singham 123,sampoornesh babu,manchu vishnu,singham 123 in youtube  సంపూ సినిమా యూట్యూబ్‌లోకి!
సంపూ సినిమా యూట్యూబ్‌లోకి!
Advertisement
Ads by CJ


ఇంట‌ర్నెట్‌తోనే స్టార్ అయిపోయాడు సంపూ. ఆయ‌న వీడియోల‌కి యూ ట్యూబ్‌లో పిచ్చ గిరాకీ ఉంటుంది. సంపూ సినిమాకి సంబంధించిన  ట్రైల‌ర్ లాంటిది ఏదైనా విడుద‌ల‌య్యిందంటే స్టార్ హీరోల రేంజ్‌లో వ్యూస్ వ‌చ్చేస్తుంటాయి. దాని గురించి రెండు మూడు రోజుల‌పాటు ఆన్‌లైన్‌లో చ‌ర్చ జ‌రుగుతుంటుంది. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాల‌నుకొన్నారో ఏంటో  `సింగం 123`ని  విడుద‌లైన రెండు వారాల్లోపే యూ  ట్యూబ్‌లో పెట్టేశారు.  తెలుగు సినిమాకి సంబంధించి.. ఇంత ఫాస్ట్‌గా యూ ట్యూబ్‌లోకి ఎక్కేసిన సినిమా ఇదే!  మంచు విష్ణు సొంతంగా నిర్మించిన చిత్ర‌మిది. స్టార్ హీరోల సినిమాల్లోని స‌న్నివేశాల్ని స్ఫూఫ్‌గా చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు. మంచి ప్రారంభ‌వ‌సూళ్లే వ‌చ్చాయి. ఇక థియేట‌ర్‌కి వ‌చ్చి సంపూని చూడ‌టం ఇష్టం లేని వాళ్లు ఇంట్లోనే యూ ట్యూబ్‌లోనే చూసేయండంటూ విష్ణు  సినిమాని ఆన్‌లైన్‌లో పెట్టేశాడు. మ‌రి సినిమాకి ఏ రేంజ్‌లో వ్యూస్ వ‌స్తాయో చూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ