Advertisementt

బ్యాంకాక్‌ వెళ్తున్న అఖిల్‌.!

Thu 18th Jun 2015 02:23 AM
akhil movie details,v.v.vinayak,sahesha saigal,akhil movie shooting in bangkok,akhil movie in october  బ్యాంకాక్‌ వెళ్తున్న అఖిల్‌.!
బ్యాంకాక్‌ వెళ్తున్న అఖిల్‌.!
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో హీరో నితిన్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్‌ ఇప్పటివరకు 50 శాతం పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్‌ బ్యాంకాక్‌లో ప్రారంభమవుతుంది. రేపు(18) అఖిల్‌, వినాయక్‌ బ్యాంకాక్‌ బయల్దేరుతున్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని సీన్స్‌, పాటలు చిత్రీకరిస్తారు. దీంతో 70 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. బ్యాంకాక్‌ షెడ్యూల్‌ తర్వాత బ్యాలెన్స్‌ వర్క్‌ అంతా హైదరాబాద్‌లోనే కంప్లీట్‌ చేస్తారట. షూటింగ్‌తోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా కంప్లీట్‌ చేసి సెప్టెంబర్‌లో చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు. అయితే సెప్టెంబర్‌కి సినిమా రిలీజ్‌ కష్టమేనని తెలిసింది. అక్టోబర్‌లో ఆడియో రిలీజ్‌ చేసి అదే నెలలో సినిమాని కూడా రిలీజ్‌ చెయ్యాలన్నది దర్శకనిర్మాతల ప్లాన్‌. 

వెలిగొండ శ్రీనివాస్‌ అందించిన కథకి తన మార్క్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని కూడా జోడిరచి అఖిల్‌ని మాస్‌ కమర్షియల్‌ హీరోగా లాంచ్‌ చేయడానికి వినాయక్‌ శాయశక్తులా కృషి చేస్తున్నాడు. మొట్ట మొదటిసారి థమన్‌, అనూప్‌ కలిసి ఈ సినిమాకి మ్యూజిక్‌ చేస్తున్నారు. తన సినిమాల్లో హీరోయిన్‌ సెలక్షన్‌పై సరైన శ్రద్ధ పెట్టని వినాయక్‌ ఈ సినిమా హీరోయిన్‌ విషయంలో చాలా కేర్‌ తీసుకొని సెలెక్ట్‌ చేశాడు. సాయేషా సైగల్‌కి ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యం వున్న క్యారెక్టర్‌ ఇచ్చాడట. అలాగే అఖిల్‌, సాయేషా జంట చూడముచ్చటగా వుందని చెప్తున్నారు. ఏది ఏమైనా వినాయక్‌ వంటి కమర్షియల్‌ డైరెక్టర్‌ రూపొందిస్తున్న చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇస్తున్న అఖిల్‌కి ఇది తప్పకుండా మంచి సినిమా అవుతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ