Advertisementt

సుధీర్‌బాబు నిర్మాతగా మారాడు..!

Tue 16th Jun 2015 06:57 AM
sudeerbabu as producer,sudeerbabu become producer,krishnamma kalipindi iddarini,  సుధీర్‌బాబు నిర్మాతగా మారాడు..!
సుధీర్‌బాబు నిర్మాతగా మారాడు..!
Advertisement
Ads by CJ

 

బావ మ‌హేష్‌బాబు బాట‌లోనే అడుగులేస్తున్నాడు సుధీర్‌బాబు. మొన్న‌నే మ‌హేష్‌బాబు సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. `శ్రీమంతుడు`కి తానూ ఓ నిర్మాత‌గా వ్యవ‌హ‌రిస్తున్నాడు. ఇప్పుడు బావ సుధీర్‌బాబు కూడా మ‌హేష్ బాట‌లోనే అడుగులేస్తూ నిర్మాత‌గా మారాడు. తాను క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `భ‌లే మంచి రోజు` చిత్రాన్ని స్నేహితుల‌తో క‌లిసి సొంతంగా నిర్మిస్తున్నాడు.  శ్రీరామ్ అనే ఓ యువ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే చివ‌రి ద‌శ‌కు చేరుకొంద‌ట‌ట‌. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాడ‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో స్నేహితుల‌తో క‌లిసి నిర్మిస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు సుధీర్‌. మ‌హేష్ అయితే చాలా రోజులుగా ఇండస్ట్రీలో ఉంటున్నాడు. ఆయ‌న‌కి సొంత స్టూడియోతో పాటు,  ఎప్ప‌ట్నుంచో నిర్మాణ సంస్థ‌లు ఉన్నాయి. ఆ అనుభ‌వంతో త‌న పేరుతోనూ ఓ నిర్మాణ సంస్థ‌ని మొద‌లుపెట్టాడు. మహేష్ బావ సుధీర్ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి ఐదేళ్లు కూడా కాక‌మునుపే ఇలా నిర్మాత‌గా మార‌డం విశేషం. మ‌రి నిర్మాత‌గా ఎలాంటి రిజ‌ల్ట్ సాధిస్తాడో చూడాలి.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ