Advertisementt

సునీల్‌ మరోటి ఒప్పేసుకొన్నాడు..!!

Tue 16th Jun 2015 02:59 AM
sunil new movie,kranti madhav,vamsi krishna akella,sunil  సునీల్‌ మరోటి ఒప్పేసుకొన్నాడు..!!
సునీల్‌ మరోటి ఒప్పేసుకొన్నాడు..!!
Advertisement
Ads by CJ
యమా స్పీడుమీదున్నాడు సునీల్‌. వరుసగా సినిమాలకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేస్తున్నాడు. దిల్‌రాజు బ్యానర్‌లో వాసువర్మ దర్శకుడిగా ఓ సినిమా   చేస్తూనే... వంశీ కృష్ణ ఆకెళ్లతో మరో చిత్రాన్ని చేయడానికి ఓకే చెప్పేశాడు. దాంతోపాటు తాజాగా ఇంకో సినిమాని కూడా లైన్లో పెట్టాడు.  ‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాలతో అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న క్రాంతిమాధవ్‌తో  సునీల్‌ ఓ చిత్రం చేయబోతున్నారు. ‘సంతోషం సగం బలం’ పేరుతో ఆ చిత్రం తెరకెక్కబోతోందని తెలిసింది. స్క్రిప్టులో క్రాంతిమాధవ్‌ తరహా హార్ట్‌ టచింగ్‌ ఎలిమెంట్స్‌తో పాటు... సునీల్‌ మార్క్‌ వినోదం కూడా పుష్కలంగా ఉంటుందట. దీంతో సునీల్‌ సినిమాకి ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది. ఓ అగ్ర నిర్మాణ సంస్థలోనే ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు సమాచారం.  ‘భీమవరం బుల్లోడు’ తర్వాత సునీల్‌కి చాలా గ్యాప్‌ వచ్చింది. కథల విషయంలో ఆయన ఆచితూచి అడుగులేయడంతో ఆ గ్యాప్‌ వచ్చింది.  దిల్‌రాజు బ్యానర్‌లో వాసు వర్మ దర్శకత్వంలో సినిమాని ఎప్పుడో మొదలుపెట్టారు కానీ... అది బాగా స్లోగా షూటింగ్‌ జరుపుకొంది.  ‘కృష్ణాష్టమి’ పేరుతో రూపుదిద్దుకొంటున్న ఆ చిత్రాన్ని త్వరలోనే  ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని తెలుస్తోంది. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ