Advertisementt

'మలుపు' మూవీ ఆడియో రిలీజ్..!

Mon 15th Jun 2015 10:09 AM
dasari narayanarao,adi,raviraja pinisetty,sathyaprabhas  'మలుపు' మూవీ ఆడియో రిలీజ్..!
'మలుపు' మూవీ ఆడియో రిలీజ్..!
Advertisement
Ads by CJ

ఆది పినిశెట్టి, నిక్కిగార్ల్ జంటగా ఆదర్శ చిత్రాలయ బ్యానర్ పై సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో రవిరాజా పినిశెట్టి నిర్మిస్తున్న చిత్రం 'మలుపు'. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ జూన్ 14న హైదరాబాద్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు బిగ్ సిడిను ఆవిష్కరించారు. ఆడియో సిడిలను అల్లుఅరవింద్ విడుదల చేసి తొలి ప్రతిమను కోదండ రామిరెడ్డి కి అందించారు. థియేట్రికల్ ట్రైలర్ ను రాజేంద్రప్రసాద్ విడుదల చేసారు. ప్రసన్, శ్యామ్, ప్రవీణ్ సంగీతం అందించిన ఈ ఆడియో థింక్ మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలయింది. ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ "పినిశెట్టి శ్రీరాం మూర్తి అంటే ప్రస్తుతం ఉన్న వాళ్లకి తెలియకపోవచ్చు. అల్లురామలింగయ్య, చలం వంటి కళాకారులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. దర్శకుడిగా, రచయితగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన చేసిన సినిమాలో రచయితగా నా పేరు కూడా ఉండటం అద్రుష్టంగా భావిస్తున్నాను. రవిరాజా పినిశెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా నా దగ్గరే కెరీర్ మొదలు పెట్టాడు. యాబై సినిమాలకు పైగా దర్శకత్వం వహించాడు. ఆది, సత్యప్రభాస్ లను ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. ఆది చేసిన మొదటి చిత్రం విచిత్రం సినిమాను నేనే ప్రొడ్యూస్ చేసాను. సత్యప్రభాస్ ఫారెన్ వెళ్లి దర్శకత్వం  కోర్సులో శిక్షణ పొందాడు. తెలుగు ప్రేక్షకులు వీరిని ఆదరించాలని, సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ "నేను రవిరాజా మంచి స్నేహితులం. మా అనుబంధం దాదాపు యాబై ఏళ్ళు. ఈ సినిమా నిర్మాణ విషయంలో నా సలహా అడిగాడు. తన కొడుకులకు నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది" అని చెప్పారు.

కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ "రవిరాజా నిర్మాతగా, సత్యప్రభాస్ దర్శకునిగా మొదటి సినిమా ఇది. ఈ సినిమాతో రవిరాజా కు మంచి పేరు, లాబాలు రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రసన్, శ్యామ్, ప్రవీణ్ మాట్లాడుతూ "ఈ సినిమాలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు" అని చెప్పారు.

రవిరాజా పినిశెట్టి మాట్లాడుతూ "నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. నా ఇద్దరి కొడుకులు బాగా చదువుకున్నారు. ఇండస్ట్రీకి వస్తారనుకోలేదు. ఆది హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. సత్యప్రభాస్ డైరెక్టర్ అవుతానని చెప్పడంతో అనుకోకుండా ఒకరోజు సినిమా రీమేక్ రైట్స్ కొన్నాను. కాని దానికి తను ఒప్పుకోలేదు. ఓ యాధార్థ సంఘటన ఆదారంగా ఓ కథను రాసుకొన్నాడు. కథ విన్నాను. చాలా బావుంది. అయితే ఓ డెబ్యూ డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్ట్ తో సినిమా అంటే నిర్మాతలు ముందుకురారు. అందుకే నేనే నిర్మాతగా మారాను. సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది" అని చెప్పారు.

సత్యప్రభాస్ మాట్లాడుతూ "దర్శకునిగా నా తొలి సినిమా ఇది. ఇంకా చాలా విషయాలలో పరిజ్ఞానం పొందాలి. అందరు ఆసిర్వదించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

హీరో ఆది మాట్లాడుతూ "అన్నయ్య అమెరికన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో తీసిన షార్ట్ ఫిలిం కు బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్నాడు. ఆ అవార్డు సొంతం చేసుకున్న తొలి భారతీయుడు కూడా తనే. తను డైరెక్టర్ గా సినిమా అంటే నేన్ను హీరోగా తీసుకుంటాడా లేదా అని కొంచెం టెన్షన్ పడ్డాను. చివరకి నన్నే హీరోగా పెట్టి సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

ఇంకా ఈ కార్యక్రమంలో టాగూరు మధు, రాజేంద్రప్రసాద్, వెంకటేశ్వరావు, కె.ఎల్.నారాయణ, హరీష్ శంకర్, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, శివాజీరాజా, ఏడిద శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ