Advertisementt

బ‌న్నీ చిత్రం మొద‌లైంది..!

Sun 14th Jun 2015 12:09 PM
allu arjun new movie,bunny boyapati srinu movie,allu arjun movie starting soon  బ‌న్నీ చిత్రం మొద‌లైంది..!
బ‌న్నీ చిత్రం మొద‌లైంది..!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ కొత్త సినిమా కోసం రంగంలోకి దిగాడు. బోయ‌పాటి శ్రీను  ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్న సినిమా మొద‌లైంది. ఆ విష‌యాన్ని బోయ‌పాటి శ్రీను వెల్ల‌డించారు. ఈ సినిమాపై మొద‌ట్నుంచీ ప‌లు రూమ‌ర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. క‌థ విష‌యంలో ఇంకా బ‌న్నీ పూర్తి స్థాయిలో  సంతృప్తి చెంద‌లేద‌నీ, అందుకే సినిమా ప్రారంభంలో ఆల‌స్యం చోటు చేసుకొంటోంద‌నీ... ఈ సినిమా  సెట్స్‌పైకి వెళ్లేవ‌ర‌కు న‌మ్మ‌కాల్లేవ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు మాట్లాడుకొన్నాయి. ఆ పుకార్లు అబ‌ద్ధ‌మని నిరూపిస్తూ ఇటీవ‌లే సినిమాని మొద‌లుపెట్టారు. క‌థానాయిక‌ని కూడా ఎంపిక చేశార‌ని తెలుస్తోంది. బ‌న్నీ స‌ర‌స‌న క‌థానాయిక‌గా హ‌న్సిక న‌టిస్తోందంటూ వ‌చ్చిన వార్త‌లు అబ‌ద్ధ‌మ‌ని తెలుస్తోంది. సినిమాకి సంబంధించిన మొత్తం విష‌యాల్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని బోయ‌పాటి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ