Advertisementt

యువ‌రాణిగా హ‌న్సిక..!

Sun 14th Jun 2015 12:08 PM
hasika,puli,hansika mothwani,vijay,puli movie details,  యువ‌రాణిగా హ‌న్సిక..!
యువ‌రాణిగా హ‌న్సిక..!
Advertisement
Ads by CJ

 

త‌మిళంలో బోలెడ‌న్ని సినిమాలు చేస్తోంది హ‌న్సిక‌. కానీ ఏ సినిమా గురించీ చెప్ప‌నంత ఎక్కువ‌గా ఇటీవ‌ల ఓ సినిమా గురించి చెబుతోంది. జీవితంలో అలాంటి సినిమాలో న‌టించే అవ‌కాశం ఒక్కసారే వ‌స్తుంద‌నీ, ఆ చిత్రం ఓ గొప్ప  మైలురాయిగా నిలిచిపోతుంద‌ని  త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చిన ప్ర‌తీ ఒక్క‌రికీ చెబుతోంద‌ట హ‌న్సిక‌. ఇంత‌కీ ఆ చిత్ర‌మేదో తెలుసా?  విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `పులి`. భారీ వ్య‌యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న శ్రుతిహాస‌న్‌తోపాటు హ‌న్సిక న‌టిస్తోంది. ఇదే చిత్రంలో అతిలోక సుంద‌రి శ్రీదేవి కూడా న‌టిస్తోంది. సుధీర్ఘ‌కాలం త‌ర్వాత ఆమె ద‌క్షిణాదిలో చేస్తున్న చిత్ర‌మిది. ఇందులో హ‌న్సిక ఓ యువ‌రాణిగా క‌నిపించ‌బోతోంద‌ట‌. ఆ పాత్ర గురించే త‌న స‌న్నిహితులుకీ, మీడియాకీ తెగ చెబుతోంది. విజ‌య్‌తో క‌లిసి తెర‌ను పంచుకోవ‌డం గురించి కూడా హ‌న్సిక క‌థ‌లు క‌థ‌లుగా చెబుతోంద‌ట‌. మొత్తంగా ఈ సినిమాపై హ‌న్సిక భారీగానే ఆశ‌లు పెట్టుకొన్నట్టు తెలుస్తోంది.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ