Advertisementt

జూలై 10న విడుదల కానున్న'బాహుబలి'..!

Sun 14th Jun 2015 10:25 AM
bahubali audio release,july 10th movie release,rajamouli,prabhas,anushka  జూలై 10న విడుదల కానున్న'బాహుబలి'..!
జూలై 10న విడుదల కానున్న'బాహుబలి'..!
Advertisement
Ads by CJ

ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రల్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో అర్క మీడియా వర్క్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి'. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ జూన్13న తిరుపతిలో అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీత అందించిన ఈ చిత్ర ఆడియో లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలయింది. థియేట్రికల్ ట్రైలర్ ను నటుడు కృష్ణంరాజు రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, దర్శకుడు రాజమౌళి, కీరవాణి, ఎన్.వి.ప్రసాద్, సెంథిల్, విజయేంద్రప్రసాద్, ప్రభాకర్, అడవి శేష్, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా, రమారాజమౌళి, వల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ "ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన అభిమానులకు మా వందనాలు. ఇంత భారీగా ఏర్పాట్లు చేసిన పోలీస్ బృందానికి మా కృతజ్ఞతలు. ఇక సినిమా విషయానికి వస్తే 'బాహుబలి' కోసం ప్రతి టెక్నీషియన్ చాలా కష్టపడి పని చేసారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ గారు డైలాగ్స్ చెప్తుంటే మాకు చాలా ఎనర్జీ వచ్చేది. ఆమె ఈ సినిమాలో నటించడం మా అద్రుష్టంగా భావిస్తున్నాను. కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ గారి నుండి ఎంతో నేర్చుకోవాలి. డైరెక్టర్ కి వాల్యూ ఇచ్చే మనిషి. నాజర్ గారు యాక్టింగ్ కెరీర్ నా వయసుంటుంది. ఆయనను తోటి విధ్యార్థిలా ఫీల్ అవుతాను. ఆయన చెప్పే టెక్నికల్ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. క్లాసిక్ సినిమా చేయాలని ఆయన చెప్తుంటారు. 'బాహుబలి' క్లాసిక్ గా ఉంటుందనుకుంటున్నాను. తమన్నా ఓ ప్రొఫెషనల్ యాక్టర్. సినిమాల పట్ల కమిట్మెంట్ తో వర్క్ చేస్తుంది. ఈ చిత్రంలో దేవసేన అనే పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఆ పాత్రకు అనుష్క తప్ప మరెవరు సూట్ అవరనిపించి ఆమెకు స్టొరీ చెప్పాను. వినగానే సినిమా చేయాడానికి అంగీకరించింది. మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనిపించే నటి అనుష్క. నా సినిమాలలో విలన్ పాత్రలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. హీరో కన్నా విలన్స్ పవర్ ఫుల్ గా ఉండాలి. సినిమాలో ప్రభాస్ హీరో అనుకున్నప్పుడు ఆయనకు ఆపోజిట్ గా రానా మాత్రమె చేయగలడనుకున్నాను. కాని విలన్ నటించమని అడగడానికి కాస్త సంకోచించాను. ఇప్పుడే కెరీర్ మొదలు పెట్టిన రానా ప్రత్యర్థి పాత్రలో నటించడానికి అంగీకరిస్తాడా లేదా అనుకున్నాను. కథ విన్న కొన్ని రోజులకు నటిస్తానని చెప్పాడు. ఈ రెండు సంవత్సరాలలో మొత్తం సినిమాలో పని చేసిన వారందరి గురించి రానా ఓ బుక్ రాసాడు. ఆ బుక్ చదివిన తరువాత తనలో ఓ మంచి రైటర్ ఉన్నాడని అర్ధమైంది. డ్రమటైజేషన్ పార్ట్ రాయడం మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. నా భార్య రమ లేకపోతే నేను ఈ సినిమా చేయలేకపోయేవాడిని. కీరవాణి అన్నయ్య ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరికి తెలిసిన విషయమే. ప్రభాస్ తో చత్రపతి సినిమా చేసాను. నా సోల్ మెట్ తను. బాహుబలి సినిమా అధ్బుతంగా తీస్తున్నారని నా వెన్నంటే ఉంటూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేసాడు ప్రభాస్. నాలుగు సంవత్సరాల క్రితం తనకు స్టొరీ లైన్ చెప్పాను, మూడు సంవత్సరాల క్రితం మొత్తం కథ చెప్పాను, రెండు సంవత్సరాల క్రితం ఓ సంవత్సర కాలం డేట్స్ ఇవ్వమని అడిగాను. కాని ప్రభాస్ రెండు సంవత్సరాలు ఈ సినిమా కోసమే పని చేసాడు. అందరికంటే సినిమాపై ప్రభాస్ కే నమ్మకం ఎక్కువ ఉంది. షూటింగ్ సమయంలో చాలా కష్టపడ్డాడు. ఎలాంటి పిర్యాదు చేయకుండా సినిమా కంప్లీట్ చేసిన ప్రభాస్ కు నా థాంక్స్" అని చెప్పారు.

ప్రభాస్ మాట్లాడుతూ "ఈ ఆడియో రిలీజ్ కు పెదన్నాన్న గారు రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు మ్యూజిక్ కీరవాణి గారు తప్ప మరెవరు చేయలేరు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అధ్బుతంగా చేసారు. బాహుబలి సాంగ్ నాకు చాలా నచ్చింది. రాజమౌళి గారు చేసిన 'స్టూడెంట్ నెంబర్1' సినిమా పెద్ద హిట్. కాని నాకు నచ్చలేదు. నేను కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో రాజమౌళి గారు నాకొక కథ చెప్పారు. నేను నో చెప్పాను. ఈశ్వర్ సినిమా రిలీజ్ అయి వర్షం సినిమా షూటింగ్ సమయంలో ఆయన చేసిన 'సింహాద్రి' రిలీజ్ అయింది. సినిమా చూసి నాకు పిచెక్కిపోయింది. ఎంత బాగా తీసాడు ఈ డైరెక్టర్ కి నేను నో చెప్పానా అని చాలా ఫీల్ అయ్యాను. నా లక్ ఆయనతో చత్రపతి సినిమా చేసే చాన్స్ వచ్చింది. ఓ పెద్ద సినిమా చేద్దామని అప్పుడే చెప్పారు. అదే 'బాహుబలి'. నేను రాజమౌళి గారికి పెద్ద ఫ్యాన్ ని. మళ్ళి మళ్ళి రాణి సినిమా ఇది. రాజమౌళి గారితో అసోసియేట్ అవ్వడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. అందరు ఎంతగానో ఎదురు చూస్తున్నఈ చిత్రం జూలై 10న విడుదల కానుంది" అని చెప్పారు.

అనుష్క మాట్లాడుతూ "ఈ చిత్రంలో దేవసేన పాత్రలో నటించాను. ఈ సినిమాలో నేను డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాను. అందరు ఈ సినిమా కోసం ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలానే వెయిట్ చేస్తున్నాను" అని చెప్పారు.

నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ "రాజమౌళి గారి దర్శకత్వంలో ఇంత భారీ ప్రాజెక్ట్ చేయడం చాలా గొప్పగా ఉంది. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

ఎమ్.ఎమ్.కీరవాణి మాట్లాడుతూ "సినిమా పాటలు అందరికీ నచ్చుతాయని భావిస్తున్నాను" అని చెప్పారు.

కృష్ణంరాజు మాట్లాడుతూ "తెలుగు చలన చిత్ర పరిశ్రమను హాలీవుడ్ రేంజ్ కు తీసుకువెళ్ళే సినిమా 'బాహుబలి'. నిర్మాతలు రాజమౌళి మీద నమ్మకంతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆలస్యమైనా ఓ గొప్ప సినిమాను చూడబోతున్నాం. 'బాహుబలి2'తోనే ఆపేయకుండా మరిన్ని సిరీస్ చేయాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు. 

తమన్నా మాట్లాడుతూ "ఇంతమంది అభిమానుల సమక్షంలో ఆడియో వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ ఆడియో వేడుకలో టెక్నీషియన్స్ గురించి మాట్లాడడం, వాళ్ళని ప్రేక్షకులకు పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమాలో సాంగ్స్ బావున్నాయి. కీరవాణి గారు మ్యూజిక్ అందించిన ఏ పాటలయినా మళ్ళి మళ్ళి వినాలనిపించేలా ఉంటాయి. అంత మంచి మ్యూజిక్ ఇస్తారు" అని చెప్పారు.

రానా మాట్లాడుతూ "చిన్నప్పటినుండి సినిమాలలో పెరగడం వలన హీరోలనే దేవుళ్ళుగా భావిస్తున్నాను. విలన్ పాత్రలో ఎందుకు చేయడమని చాలా మంది చెప్పారు. కాని 'బాహుబలి' కలకాలం నిలిచిపోయే ఓ మహాశిల్పం. ఇలాంటి ఓ ఇతిహాసంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు, ప్రభాస్ కు రుణపడి ఉంటాను" అని చెప్పారు.

రమ్యకృష్ణ మాట్లాడుతూ "చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. నా కెరీర్ లో మొదటిసారి ఓ సినిమా కోసం ఇంతలా వేచి చూస్తున్నాను. మంచి క్వాలిటీ ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారు" అని చెప్పారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సెంథిల్, కథ: విజయేంద్రప్రసాద్, ఎడిటింగ్: వెంకటేశ్వరరావు, కోటగిరి, ఆర్ట్: మను జగద్, ఫైట్స్: పీటర్ హెయిన్, సమర్పణ: కె.రాఘవేంద్రరావు, దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి, నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ