ప్రభాస్ అభిమానులకు, `బాహుబలి` గురించి ఎదురు చూస్తున్న సగటు సినీ ప్రేక్షకుడికి ఓ శుభవార్త. `బాహుబలి` చిత్రం అనుకొన్న సమయానికే విడుదల కాబోతోంది. ఆడియో వేడుకలో స్వయంగా రాజమౌళిని అడిగి ప్రభాస్ మరోసారి విడుదల తేదీని ప్రకటించారు. జులై 10 అంటూ రాజమౌళి నోటి నుంచే చెప్పించారు ప్రభాస్. ఆ కబురు విన్నప్పట్నుంచి ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. నిజానికి జులై 10 అని ఎప్పుడో విడుదల తేదీని ప్రకటించేసింది చిత్రబృందం. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులవల్ల అనుకొన్న సమయానికి విడుదల కాకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజమౌళి కూడా విడుదల ఎప్పుడో చెప్పలేనని ఒకసారి విలేకర్ల సమావేశంలో చెప్పడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. కానీ ఆడియో విడుదల వేడుకలో ప్రభాస్ జులై 10నే అని రాజమౌళిని అడిగి మరీ ప్రకటించడంతో అంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.