Advertisementt

'టెర్రర్' మూవీ లోగో లాంచ్..!

Sat 13th Jun 2015 05:06 AM
terror movie,satish kasetty,srikanth,shaikk mastan,nikitha  'టెర్రర్' మూవీ లోగో లాంచ్..!
'టెర్రర్' మూవీ లోగో లాంచ్..!
Advertisement
Ads by CJ

శ్రీకాంత్, నికితా జంటగా అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ కరీమ్ సమర్పణలో సతీష్ కాసెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మించిన సినిమా 'టెర్రర్'. ఈ సినిమా లోగో లాంచ్ గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో శాసనసభ్యులు గణేష్ గుప్తా, నిర్మాత ఎమ్.ఎల్.కుమార్ చౌదరి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు సతీష్ కాసెట్టి మాట్లాడుతూ " 'టెర్రర్' అనేది ఓ పోలీస్ కథ. హైదరాబాద్ లో ఓ టెర్రర్ యాక్టివిటీ జరుగుతుందని తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ ఎలా ఆ బాంబ్ బ్లాస్ట్ ను చేదించాడు అనేదే ఈ సినిమా. ఈ సినిమా థ్రిల్లర్ నేపధ్యంలో సాగుతుంది. పోలీస్ పాత్రలో శ్రీకాంత్ గారు అధ్బుతంగా నటించారు. రెండు గంటల పదిహేను నిమిషాల సాగే ఈ సినిమాలో కామెడీ, పాటలు లేవు. ప్రస్తుతం సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ జరుగుతోంది. సాయి కార్తిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. నన్ను నమ్మి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన షేక్ మస్తాన్ గారికి నా ధన్యవాదాలు" అని చెప్పారు.

ఎమ్.ఎల్.ఎ గణేష్ గుప్తా మాట్లాడుతూ "ప్రస్తుతం ఉన్న రాజకీయనాయకులు సినిమాలు చూస్తారో చూడరో తెలియదు కాని నేను ప్రతి సినిమా చూస్తాను. ఈ సినిమా పోస్టర్స్ చూస్తుంటే చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి.  శ్రీకాంత్ గారు ఏ సినిమాలో అయిన అధ్బుతంగా నటిస్తారు. 'టెర్రర్' చిత్ర బృందానికి నా అభినందనలు" అని చెప్పారు.

ఎమ్.ఎల్.కుమార్ చౌదరి మాట్లాడుతూ "సినిమా టైటిల్ అధ్బుతంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ గారు నటించడం ఆనందంగా ఉంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

నిర్మాత షేక్ మస్తాన్ మాట్లాడుతూ "నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. పొలిటికల్ స్టొరీ తీయమని సతీష్ గారిని కలిస్తే ఆయన 'టెర్రర్' స్టొరీ ని తెరకెక్కించేలా నన్ను ఒప్పించారు. 120 సినిమాలలో హీరోగా నటించిన శ్రీకాంత్ గారు ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా శాటిలైట్ అవుతున్న సమయంలోనే మరో సినిమా చేయాలనుకుంటున్నాను" అని చెప్పారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ "ఈ చిత్రంలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించాను. ఇంతకముందు సినిమాలో కూడా పోలీస్ గా నటించాను. కానీ ఈ సినిమాలో చాలా భిన్నంగా కనిపిస్తాను. హై టెక్నికల్ వాల్యూస్ తో తీసిన చిత్రమిది. సినిమాలో అందరు అవార్డు వచ్చే పెర్ఫార్మన్స్ చేసారు. కమర్షియల్ గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ నికితా, కోటేశ్వరావు, లక్ష్మి భూపాల్, రవివర్మ, గురు చరణ్, హరి అయినీడి తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీ భూపాల్, ఎడిటర్: బసవ పైడి రెడ్డి, ఆర్ట్: మురళి కొండేటి, ఫైట్స్: రన్ జాషువా, మ్యూజిక్: సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్: షేక్ జైన్ లాబ్దీన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి అయినీడి, ప్రొడ్యూసర్: షేక్ మస్తాన్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సతీష్ కాసెట్టి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ