Advertisementt

'కేరింత' క్లీన్ సినిమా అంటున్న దాసరి..!

Fri 12th Jun 2015 05:32 AM
kerintha,dil raju,dasari narayanarao,sumanth aswin  'కేరింత' క్లీన్ సినిమా అంటున్న దాసరి..!
'కేరింత' క్లీన్ సినిమా అంటున్న దాసరి..!
Advertisement
Ads by CJ

సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా 'కేరింత'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకొని జూన్ 12న విడుదల కానుంది. జూన్ 11న దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి చిత్ర బృందం ప్రీమియర్ షో వేసారు. సినిమా చూసిన అనంతరం ఆయన మాట్లాడుతూ "చాలా సినిమా ఫంక్షన్స్ లో తెలుగు ఇండస్ట్రీలో మంచి సినిమాలు రావట్లేదని బాధపడుతూ చెప్పాను. కాని ఈరోజు నేను ఎలాంటి సినిమాలు రావాలని కోరుకున్నానో అలాంటి సినిమా 'కేరింత' వచ్చింది. దిల్ రాజు అంటే నాకు చాలా ఇష్టం. బొమ్మరిల్లు సినిమా దగ్గర నుండి ఆయనంటే అభిమానం పెరిగింది. కొత్తబంగారు లోకం వంటి అధ్బుతమైన సినిమాను తెరకెక్కించాడు. నిర్మాతగా సినిమాకు ఏం కావాలో దగ్గర ఉండి చూసుకునే మనిషి. నిజంగా నిర్మాతలు సినిమాపై ఆసక్తి చూపిస్తే ఖచ్చితంగా 'బొమ్మరిల్లు' , 'కేరింత' వంటి సినిమాలు వస్తాయి. బొమ్మరిల్లు సినిమా తరువాత చాలా మంచి సినిమాలు వచ్చాయి కాని క్లీన్ సినిమాలు రాలేదు. ఆ సినిమా తరువాత వచ్చిన క్లీన్ మూవీ కేరింతే. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలలో స్నేహానికి, ప్రేమకి మధ్య ఓ క్లారిటీ మిస్ అవుతుంది. ఈ సినిమాలో ఆ క్లారిటీను అధ్బుతంగా చూపించారు. డైరెక్టర్ గారు మంచి చాయిస్ తో సినిమా చేసారు. టేకింగ్ కోసం ప్రత్యేకించి కొన్ని షాట్స్ పెట్టారు. సాంగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అధ్బుతంగా ఉంది. ఆర్టిస్టులు కొత్తవారైనా బాగా నటించారు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా తరువాత దిల్ రాజు పెద్ద హీరోలతో సినిమాలు చేయకూడదు(నవ్వుతూ)" అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ