టెంపర్ తర్వాత పూరి జగన్నాథ్ చాలా స్పీడప్ అయిన విషయం తెలిసిందే. పూరి లేటెస్ట్ మూవీ జ్యోతిలక్ష్మీ రేపు(12) రిలీజ్ అవుతుండగా, జూన్ 15న నితిన్‌తో ఓ చిత్రాన్ని స్టార్ట్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు నితిన్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో సినిమా లేదని తెలుస్తోంది. నితిన్, చిరంజీవి సినిమాలు పూర్తయిన తర్వాత వరుణ్‌తేజ్‌తో సినిమా చెయ్యాలన్న ప్లానింగ్‌లో వున్న పూరి సడన్‌గా ఇప్పుడు నితిన్ సినిమాను పక్కన పెట్టేసి వరుణ్‌తేజ్‌తో సినిమా స్టార్ట్ చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్ సి.కళ్యాణ్ నిర్మించే ఈ చిత్రాన్ని జూన్ నెలలోనే ఇమ్మీడియట్‌గా స్టార్ట్ చేసెయ్యాలని డిసైడ్ అయ్యాడు. ఈ సినిమాని ఎంత స్పీడ్‌గా స్టార్ట్ చేస్తున్నాడో అంతే స్పీడ్‌గా షూటింగ్ కూడా కంప్లీట్ చేసెయ్యాలని ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆగస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవితో ‘ఆటోజాని’ చిత్రాన్ని స్టార్ట్ చేస్తున్న పూరి ఈలోపుగానే వరుణ్‌తేజ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేసి మెగాస్టార్ 150వ సినిమాపై కాన్‌సన్‌ట్రేట్ చెయ్యాలన్నది అతని ఆలోచన. అయితే వరుణ్‌తో చెయ్యబోయే సినిమాని ఈనెలలో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అసలు సబ్జెక్ట్ ఏమిటి? మిగతా ఆర్టిస్టులు ఎవరు? అనే విషయాలన్నీ త్వరలోనే ఎనౌన్స్ చేస్తారట. ఇక్కడ మరో విషయం ఏమిటంటే అసలు నితిన్‌తో సినిమా వుంటుందా? లేదా? అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.