సుధీర్‌బాబు, నందిత హీరోహీరోయిన్లుగా రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై ఆర్.చంద్రు దర్శకత్వంలో శ్రీమతి, శ్రీ లగడపాలి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ "కన్నడంలో చార్మినార్ అనే చిత్రాన్ని రూపొందించారు చంద్రు. ఈ చిత్రానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాన్ని అందించింది. చార్మినార్ సినిమా చూడగానే ఆ కథతో ప్రేమలో పడిపోయాను. వెంటనే తెలుగు హక్కులు సొంతం చేసుకుని అదే దర్శకుడితో తెలుగులో సినిమా ప్రారంభించాను. చక్కని లవ్ ఎంటర్‌టైనరిది. ఎటువంటి వల్గారిటీ లేకుండా చంద్రు అద్భుతంగా తెరకెక్కించారు. కుటుంబ సమేతంగా చూడదగిన విధంగా ఉంటుంది. సుధీర్‌బాబు, నందితల నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. నందిత పాత్ర వినోదాత్మకంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన పాటలకు చక్కని స్పందన వస్తోంది. జూన్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. హిందీ లో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నాం" అని చెప్పారు.
చంద్రు మాట్లాడుతూ "ఇప్పటివరకు నేను ఎనిమిది సినిమాలు ఫ్లాప్స్ లేకుండా డైరెక్ట్ చేసాను. తెలుగులో ఇది నా మొదటి సినిమా. నా జీవితంలో జరిగిన ఓ సంఘటనను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. సినిమా అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది" అని చెప్పారు.
నందిత మాట్లాడుతూ "ఇది చాలా మంచి సినిమా అవుతుంది. మంచి కథతో చంద్రు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో సుధీర్‌బాబు చాలా మంచి కోస్టార్. నా కెరీర్‌లో ఇది ఒక మంచి సినిమా అవుతుంది" అని అన్నారు.
సాయినాథ్ మాట్లాడుతూ "ఈ సినిమాకు మాటల రచయితగా పని చేయడం ఆనందంగా ఉంది. శ్రీధర్ గారు ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. చంద్రు తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యూత్ ఫుల్ ఫీల్ ఉన్న సినిమా. యూత్ కు ఈ సినిమా గైడ్ లాంటిది. మ్యూజిక్ అధ్బుతంగా ఉంటుంది" అని చెప్పారు