ఆది హీరోగా శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ పతాకంపై రామ్ తాళ్ళూరి సమర్పణలో వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి నిర్మిస్తున్న చిత్రం 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సాయి కుమార్ క్లాప్ కొత్తగా, గోపీమోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. వీరభద్రమ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ "ఆహనా పెళ్ళంట' సినిమా తరువాత ఆదితో సినిమా చేయాలనుకున్నాను. 'పూలరంగడు' సినిమా స్క్రిప్ట్ మొదట ఆయనకే వినిపించాను. కాని కొన్ని కారణాల వలన చేయడం కుదరలేదు. 'చుట్టాలబ్బాయి' స్టొరీ రెడీ చేసిన వెంటనే ఆది కి వినిపించాను. కథ బాగా వచ్చింది. ఈ సినిమాలో మొదటిసారి ఆది సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనింగ్ చిత్రమిది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే టైటిల్ ఇది. సినిమాలో చాలా సర్ప్రైస్ లు ఉంటాయి. ఆది సరసన ఓ స్టార్ హీరోయిన్ నటించనుంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నుండి మొదలుకానుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నాం" అని చెప్పారు.
హీరో ఆది మాట్లాడుతూ "ఇది నా కెరీర్ లో ఎనిమిదవ సినిమా. సినిమా మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. అన్ని రకాల ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉంటాయి. తమన్ మ్యూజిక్ లో డాన్సులు చేయడం చాలెంజింగ్ అనే చెప్పాలి. మ్యూజికల్ గా సినిమాను చాలా కలర్ ఫుల్ గా ప్లాన్ చేస్తున్నాం" అని చెప్పారు.
నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ "కామెడీ ఎంటర్ టైనింగ్ సినిమా ఇది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను తెరకెక్కించనున్నాం. 2015లో బెస్ట్ చిత్రంగా 'చుట్టాలబ్బాయి' నిలుస్తుందని భావిస్తున్నాను" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రదీప్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
నటీనటులు: అసుతోష్ రాణా, బ్రహ్మానందం, ఆలీ, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, పృథ్వి, పవిత్రా లోకేష్, శ్రీనివాస్ రెడ్డి, దువ్వాసి మోహన్, సప్తగిరి, రఘుబాబు, రజిత, ప్రగతి, నరసింహారెడ్డి, గిరిధర్, సత్యం రాజేష్.
ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరామెన్: నాగేంద్ర, ఆర్ట్: ఎస్.శేఖర్, ప్రొడ్యూసర్: వెంకట్ తలారి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వీరభద్రమ్.