Advertisementt

'ప్రమాదం' మూవీ ట్రైలర్ లాంచ్..!

Wed 10th Jun 2015 01:05 PM
pramadam movie trailer launch,pradeep kumar arra,sambit,mousumi  'ప్రమాదం' మూవీ ట్రైలర్ లాంచ్..!
'ప్రమాదం' మూవీ ట్రైలర్ లాంచ్..!
Advertisement
Ads by CJ

సంబిత్, మౌసుమి, స్నేహ ప్రధాన పాత్రల్లో అర్ర మూవీస్ సమర్పణలో తపస్ జేనా, ప్రదీప్ దాష్ దర్శకత్వంలో ప్రదీప్ కుమార్ అర్ర నిర్మిస్తున్న సినిమా 'ప్రమాదం'. చావు 100% అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ దర్శకుడు మారుతి చేతుల మీదుగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ "టైటిల్ చాలా బావుంది. ట్రైలర్ చూస్తుంటే నిజంగా భయం కలిగే విధంగా ఉంది. సినిమా టీమ్ అంత కష్టపడి చేసినట్లు తెలుస్తోంది. హిందీ సినిమా అయినా తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని చెప్పారు.

దర్శకుడు తపస్ జేనా మాట్లాడుతూ "కొత్త నటీనటులతో చేసిన ఓ హారర్ చిత్రమిది. సినిమా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

నిర్మాత ప్రదీప్ కుమార్ అర్ర మాట్లాడుతూ "ఫుల్ లెంగ్థ్ హారర్ సినిమా ఇది. కొత్త నటీనటులైనా అధ్బుతంగా నటించారు. జూన్ 19న సినిమా విడుదల కానుంది. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ సామ్ ప్రసన్ మాట్లాడుతూ "హారర్ సినిమాలకు మ్యూజిక్ అందించాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఓ టెక్స్ట్ బుక్ లాంటి సినిమా ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు" అని చెప్పారు. 

హీరో సంబిత్ మాట్లాడుతూ "ఇదొక హారర్ స్టొరీ. లీడ్ రోల్ లో నటించే అవకాశం ఇచ్చిన అందరికి నా థాంక్స్" అని చెప్పారు.

మౌసుమి మాట్లాడుతూ "నా మొదటి సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

ఈ చిత్రానికి మాటలు: ఓ ఎస్ అభినస్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అభిరామ్ మిశ్రా, ఎడిటర్: రాజేష్, దర్శకులు: తపస్ జేనా, ప్రదీప్ దాష్, నిర్మాత: ప్రదీప్ కుమార్ అర్ర. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ