Advertisementt

'గల్ఫ్' మూవీ ప్రమోషనల్ సాంగ్ విడుదల..!

Wed 10th Jun 2015 12:03 PM
gulf movie,suneel kumar reddy,ravindhrababu,pravin immadi  'గల్ఫ్' మూవీ ప్రమోషనల్ సాంగ్ విడుదల..!
'గల్ఫ్' మూవీ ప్రమోషనల్ సాంగ్ విడుదల..!
Advertisement
Ads by CJ

శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యెక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్న సినిమా 'గల్ఫ్'. ఈ సినిమా విశేషాలు తెలిపేందుకు చిత్రబృందం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ సాంగ్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ "ఈ చిత్రంలో గల్ఫ్ కష్టాలను మాత్రమే కాకుండా ఫెయిల్యూర్, సక్సెస్ కథలను చుపించాలనుకుంటున్నాం. దాని కోసం ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాలలో కొన్ని సమావేశాలు నిర్వహించి ప్రజల నుండి కొంత సమాచారం సేకరించాం. అలానే మస్కట్, దుబాయ్ లలో ఉండే ప్రజల నుండి కూడా సమాచారాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నాం. ఇదొక యూత్ ఫుల్ ఎంటర్ టైనింగ్ సినిమా. సినిమాలో ప్రేమ కథ కూడా ఉంటుంది" అని చెప్పారు.

నిర్మాత రవీంద్రబాబు మాట్లాడుతూ "2001 లో ఈ బ్యానర్ స్థాపించి ఎన్నో అవార్డులను సాధించిన చిత్రాలను తెరకెక్కించాం. ఈ 'గల్ఫ్' చిత్రం మేము నిర్మించిన చిత్రాలకు కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి కొత్త హీరో, హీరోయిన్ ను పరిచయం చేయనున్నాం" అని చెప్పారు.

కో ప్రొడ్యూసర్ ఎల్.ఎన్.రావు మాట్లాడుతూ "నేను వృత్తి పరంగా ఓ వైద్యుడిని. కాని నాకు సినిమాల పట్ల చాలా ప్యాషన్ ఉంది. సినిమాను నిర్మించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రంలో భాగస్తుడినయ్యాను. సునీల్ గారు సినిమాలు రొటీన్ గా డబ్బులు కోసం సినిమా చేసే విధంగా కాకుండా సొసైటీ కు ఓ సందేశం అందించే విధంగా ఉంటాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీన్ ఇమ్మడి మాట్లాడుతూ "ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం రావడం అద్రుష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కథ వినగానే షాకింగ్ గా అనిపించింది. ప్రేక్షకులకు ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది" అని అన్నారు.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ