Advertisementt

ఆదాశ‌ర్మ‌కి ఇది ఐదో పెళ్లి

Wed 10th Jun 2015 10:57 AM
adah sharma,subramanyam for sale,sai dharam tej,adha sharma new movie,   ఆదాశ‌ర్మ‌కి ఇది ఐదో పెళ్లి
ఆదాశ‌ర్మ‌కి ఇది ఐదో పెళ్లి
Advertisement
Ads by CJ
కొంత‌మందికి కొన్ని పాత్ర‌లు భ‌లే కుదురుతుంటాయి. అలా ఆదాశ‌ర్మ‌కి పెళ్లి కూతురు పాత్ర‌లు బాగా కుదురుతున్నాయి. ఇప్ప‌టిదాకా ఆమె సినిమాల‌ కోసం ఐదుసార్లు పెళ్లి కూతురైంది. అదో రికార్డుగా చెప్పుకొంటోంది ఆదా. `హార్ట్ ఎటాక్‌`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఆదా.  ఆ త‌ర‌వాత స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో ఓ పాత్ర‌లోనూ  మెరిసింది.  ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు, హిందీ, క‌న్నడ భాష‌ల్లో 8 సినిమాలు చేసింది ఆదా. వాటిలో ఐదు సినిమాల్లో పెళ్లి కూతురు గెట‌ప్ వేసింది. `హార్ట్ ఎటాక్`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి`ల‌తో పాటు హిందీ సినిమా `హ‌సీ తో ఫ‌సీ`, క‌న్న‌డ చిత్రం  `రానా  విక్ర‌మ` చిత్రాల్లో పెళ్లి కూతురు గెట‌ప్‌లో క‌నిపించింది ఆదా. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్‌తో క‌లిసి  `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్` చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమాలోనూ ఆమె పెళ్లి కూతురుగానే క‌నిపించ‌బోతోంది. ఆ సినిమా సెట్లో తాను పెళ్లి కూతురు గెట‌ప్‌లో ఉండ‌గా ఓ స్టిల్ తీసి సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్‌లో అప్‌లోడ్ చేసి త‌న పెళ్లి రికార్డును బ‌య‌ట‌పెట్టింది. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ