Advertisementt

ఆ మలయాళ సినిమాకి క్రేజ్‌ పెరుగుతోంది.!

Tue 09th Jun 2015 11:08 PM
tamil movie papanasam hindi movie drishyam,kamal haasan,ajay devgan,sriya,gauthami  ఆ మలయాళ సినిమాకి క్రేజ్‌ పెరుగుతోంది.!
ఆ మలయాళ సినిమాకి క్రేజ్‌ పెరుగుతోంది.!
Advertisement
Ads by CJ

మోహన్‌లాల్‌, మీనా ప్రధాన పాత్రల్లో మలయాళంలో రూపొందిన ‘దృశ్యం’  అక్కడ సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో వెంకటేష్‌, మీనాలతో తెలుగులో రీమేక్‌ చేస్తే ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళ్‌లో కమల్‌హాసన్‌, గౌతమిలతో ‘పాపనాశం’గానూ, హిందీలో అజయ్‌ దేవ్‌గన్‌, శ్రీయలతో ‘దృశ్యం’ పేరుతో రూపొందించారు. హిందీ ‘దృశ్యం’ జూలై 31న విడుదలవుతుండగా, తమిళ్‌ ‘పాపనాశం’ జూలై 17న రిలీజ్‌ కానుంది. మలయాళంలో దృశ్యం చిత్రానికి కథని అందించి డైరెక్షన్‌ కూడా చేసిన జీతు జోసెఫ్‌ తమిళ్‌ వెర్షన్‌ని కూడా డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఇది యూనివర్సల్‌ సబ్జెక్ట్‌ కావడం, అన్ని భాషల్లో విజయం సాధించే అవకాశాలు వుండడంతో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు దర్శకనిర్మాతలు ముందుకు వస్తున్నారు. తమిళ్‌, హిందీ వెర్షన్స్‌ కూడా బాగా రావడం, సినిమాపై పాజిటివ్‌ టాక్‌ వుండడంతో మిగతా భాషల్లో కూడా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు దర్శకనిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఏది ఏమైనా ఒక భాషలో సూపర్‌హిట్‌ అయిన చిత్రాన్ని అన్ని భాషల్లో రీమేక్‌ చేయడం అనేది అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ