విభిన్న చిత్రాలకు, విభిన్న క్యారెక్టర్స్‌కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కమల్ హాసన్ మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హిందీలో నిర్మాణం జరుపుకునే ఈ చిత్రం పేరు ‘అమర్ హై’. ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నాడు. ఈ చిత్రంలో మరో హీరోగా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు. ఆధునిక రాజకీయ వ్యవస్థ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, అండర్ వరల్డ్ వంటి అంశాలతో కమల్ రెడీ చేసిన ఈ స్క్రిప్ట్ సైఫ్ ఆలీ ఖాన్‌కి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందట. ఈ చిత్రాన్ని వీరేంద్ర కె. అరోరా, అర్జున్ ఎన్. కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సైఫ్ ఆలీఖాన్‌ని దృష్టిలో పెట్టుకొని కమల్ హాసన్ అతని క్యారెక్టర్‌ని డిజైన్ చేశాడట. ముంబై నుంచి నార్త్ ఇండియా వరకు సాగే కథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ ముంబాయి, ఢల్లీిలతోపాటు లండన్, దుబాయ్, జోర్డాన్, అమెరికా వంటి దేశాల్లో జరుగుతుంది. కమల్ హాసన్, సైఫ్ ఆలీ ఖాన్ కలిసి ఒక సినిమా చెయ్యాలన్ని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు ఇద్దరూ ఎంతో హ్యాపీగా వున్నారట. ప్రస్తుతం కమల్‌హాసన్ తమిళ్‌లో తూంగవానం పేరుతో, తెలుగులో చీకటి రాజ్యం పేరుతో రూపొందుతున్న చిత్రాల షూటింగ్‌లో బిజీగా వున్నాడు. అలాగే కమల్ హీరోగా నటించిన పాపనాశం అనే చిత్రం రిలీజ్‌కి రెడీగా వుంది.