ప్రస్తుతం టాలీవుడ్‌లో వున్న టాప్ డైరెక్టర్స్‌లో ఫాస్ట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసే దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రమే. షూటింగ్ ఎంత ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తాడో సినిమాలోని సీన్స్ కూడా అంతే ఫాస్ట్‌గా పరిగెత్తేలా చేస్తాడు. టెంపర్ తర్వాత మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన పూరి వరసపెట్టి సినిమాలు కమిట్ అయిన విషయం తెలిసిందే. పూరి లేటెస్ట్ మూవీ ‘జ్యోతిలక్ష్మీ’ జూన్ 12న విడుదలవుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజులకే నితిన్ హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్‌ని స్టార్ట్ చేస్తున్నాడు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఎన్.సుధాకర్‌రెడ్డి నిర్మించే ఈ చిత్రం జూన్ 15 నుంచి నెలరోజులపాటు రాజస్థాన్‌లో నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తర్వాత మరో 15 రోజుల్లో కొంత టాకీ, పాటలు కంప్లీట్ చేసేస్తాడట. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.