Advertisementt

'ఐనా ఇష్టం నువ్వు' ఆడియో విడుదలకు సిద్ధం..!

Mon 08th Jun 2015 08:12 AM
ina ishtam nuvvu,addala chanti,naveen vijay krishna  'ఐనా ఇష్టం నువ్వు' ఆడియో విడుదలకు సిద్ధం..!
'ఐనా ఇష్టం నువ్వు' ఆడియో విడుదలకు సిద్ధం..!
Advertisement
Ads by CJ

ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అడ్డాల ధనలక్ష్మి సమర్పణలో  నవీన్ విజయ కృష్ణ హీరోగా అడ్డాల చంటి 'ఐనా ఇష్టం నువ్వు' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు రామ్ ప్రసాద్. ఈ చిత్రం ఆడియో త్వరలోనే విడుదల కానుందని నిర్మాత అడ్డాల చంటి జూన్9న ఆయన పుట్టిన రోజు సందర్భంగా తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ "తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సుమారుగా 33 సంవత్సరాలు అయింది. ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్ ను స్థాపించి పదహారు సంవత్సరాలు అయింది. 'ఐనా ఇష్టం నువ్వు' చిత్రం మా బ్యానర్ లో వస్తున్న పదవ చిత్రం. ఈ చిత్రం ఆడియోను జూన్ చివరి వారంలో, సినిమాను జూలై నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆడియో విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లేదా విజయవాడ లో చేయాలనుకుంటున్నాం. చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం. ఎవరు ఊహించని ఓ అరుదైన కాంబినేషన్ అతిథులను ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు చుడనున్నారు. ఈ సినిమా తరువాత గ్యాప్ లేకుండా వరుసగా చిత్రాలను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాను. ప్రస్తుతానికి మూడు ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రమేష్ రాపర్తి దర్శకుడిగా ఓ సినిమా, సాయి ధరమ్ తేజ్ హీరోగా మరో సినిమా చేయడానికి అంగీకరించాను. ఈ రెండు చిత్రాలు కాకుండా పెద్ద హీరోతో మరో సినిమా చేస్తున్నాను. ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతల పరిస్థితి ఘోరంగా ఉంది. డబ్బు పెట్టి జబ్బు కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. సీనియర్ నిర్మాతనయినా ఓ సినిమా చేయడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాను. మా పరిస్థితే ఇలా ఉంటే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే నిర్మాతల పరిస్థితేంటి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ బాగుపడాలని, పాత రోజులన్నీ తిరిగి రావాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ