Advertisementt

'గుంటూరు టాకీస్' మూవీ పోస్టర్ లాంచ్..!

Mon 08th Jun 2015 08:06 AM
prveen sattharu,guntur talkies,raj kumar,siddhu,rashmi  'గుంటూరు టాకీస్' మూవీ పోస్టర్ లాంచ్..!
'గుంటూరు టాకీస్' మూవీ పోస్టర్ లాంచ్..!
Advertisement
Ads by CJ

సిద్ధు జొన్నలగడ్డ, రష్మి గౌతమ్, శ్రద్దా దాస్ ప్రధాన పాత్రల్లో ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్ పై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎమ్.రాజ్ కుమార్ నిర్మిస్తున్న సినిమా 'గుంటూరు టాకీస్'. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పోస్టర్ ను హైదరాబాద్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ "చందమామ కథలు' చిత్రం తరువాత నేను దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా ఇది. గుంటూరు సిటీలో జరిగే ఓ కథే ఈ చిత్రం. అందుకే సినిమాకు 'గుంటూరు టాకీస్' అనే టైటిల్ ను సెలెక్ట్ చేసుకున్నాం. అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రమిది. కామెడీలో కన్ఫ్యూజన్ ఉంటుంది. సినిమాలో నాలుగు పాటలున్నాయి. ప్రతి పాట డిఫరెంట్ జోనర్ లో ఉంటుంది. తెలుగు సినిమాలలో ఓ కొత్త సినిమాగా మా చిత్రం నిలుస్తుంది" అని చెప్పారు.

నిర్మాత రాజ్ కుమార్ మాట్లాడుతూ "నేషనల్ అవార్డు సాధించిన ప్రవీణ్ సత్తారు లాంటి దర్శకుడితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా స్క్రిప్ట్ బావుంది. నలబై రోజులలో ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసాం. పాటల చిత్రీకరణ కోసం ఫారెన్ వెళ్తున్నాం" అని చెప్పారు.

హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ "నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి, ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

రష్మి మాట్లాడుతూ "బుల్లితెరలో యాంకర్ గా చేసే నాకు ఈ సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ మాట్లాడుతూ "ఇది నా రెండో చిత్రం. త్వరలోనే ఆడియో విడుదల చేయనున్నాం" అని చెప్పారు.

రాజా రవీంద్ర మాట్లాడుతూ "కాస్ట్ తో సంబంధం లేకుండా కథను మాత్రమే నమ్ముకొని సినిమాలు చేస్తారు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. ఈ సినిమాలో నాదొక కీ రోల్. ప్రేక్షకులకు సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది" అని అన్నారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: రామిరెడ్డి, మ్యూజిక్: శ్రీచరణ్ పాకల, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ