Advertisementt

‘నిలువవే వాలు కనులదాన’ ఆడియో విడుదల..!

Mon 08th Jun 2015 07:28 AM
niluvave valu kanuladana. audio launch,shanthi suryam,mehar baba  ‘నిలువవే వాలు కనులదాన’ ఆడియో విడుదల..!
‘నిలువవే వాలు కనులదాన’ ఆడియో విడుదల..!
Advertisement
Ads by CJ

అవతార్‌ మెహర్‌ బాబా క్రియేషన్స్‌ పతాకంపై మెహెర్‌రాజ్‌, మనీషా జంటగా నటించిన చిత్రం ‘నిలువవే వాలుకనులదానా’! అర్జున్‌ ప్రవాస్‌ దర్శకుడు. శాంతి సూర్య మ్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. కాదంబరి కిరణ్‌ కుమార్‌ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఆడిషనల్‌ డి.సి.పి సుంకరసత్యనారాయణ బిగ్‌ సీడీని ఆవిష్కరించారు. థియేట్రికల్‌ ట్రైలర్‌ను లోహిత్‌ కుమార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...

కాదంబరి కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘మెహర్‌రాజ్‌ చక్కగా నటించాడు. పాటలు, ట్రైలర్స్‌ బావున్నాయి. శాంతి సూర్యమ్‌ అందించిన సంగీతం బావుంది. ఆడియో, సినిమాని పెద్ద హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

శాంతి సూర్యమ్‌ మాట్లాడుతూ ‘‘నా వెనుక నా మిత్రులు ఉండి నన్ను ముందుకు నడిపించారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. మెహర్‌రాజ్‌ చక్కగా నటించాడు. దర్శకుడు అర్జున్‌ ప్రవాస్‌ సినిమాని బాగా తెరకెక్కించాడు. సినిమా తప్పకండా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.

మెహర్‌రాజ్‌ మాట్లాడుతూ ‘‘చిన్నప్పట్నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఈ రోజు తీరింది. ప్యూర్‌ లవ్‌ స్టోరి విత్‌ ఎంటర్‌టైనింగ్‌ ఎలిమెంట్స్‌. అర్జున్‌ ప్రవాస్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాని అనుకున్న టైమ్‌లో పూర్తి చేశారు. సినిమా తప్పకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు.

దర్శకుడు అర్జున్‌  ప్రవాస్‌ మాట్లాడుతూ ‘‘‘నిర్మాణంలో రాజీ పడకుండా ఈ చిత్రాన్ని కేరళ, వైజాగ్‌, అరకులలోని బ్యూటీఫుల్‌ లోకేషన్స్‌లో తెరకెక్కించాం. ముఖ్యంగా మెహర్‌రాజ్‌ నటన, అతను చేసిన డ్యాన్స్‌లు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు కలిసి చూడవలసిన అద్భుతమైన ప్రేమకథా చిత్రమిది. శాంతిసూర్యం అందించిన సంగీతం హృదయాల్ని అత్తుకుంటుంది. ముఖ్యంగా మా నిర్మాత అందించిన సహకారం మరువలేనిది" అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో శాంతి సూర్యమ్‌, హీరో మెహర్‌రాజ్‌, మనీషా సరిపల్లి, కాదంబరి కిరణ్‌కుమార్‌, సింధు రామ్‌ప్రసాద్‌, ఆడిషనల్‌ డి.సి.పి సుంకరసత్యనారాయణ, ఆడిషనల్‌ ఎ.సి.పి వసంత్‌రావు, ఆడిషనల్‌ ఎస్‌.పి తులసీరామ్‌ ప్రసాద్‌,ఆదిత్య మ్యూజిక్‌ సత్యదేవ్‌, లోహిత్‌కుమార్‌, అభిరామ్‌, దర్శకుడు అర్జున్‌ ప్రవాస్‌ సహా ఇతర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

మెహర్‌రాజ్‌, మనీషా సరిపల్లి, షరీఫ్‌, శ్యామ్‌, వల్లి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: మనోహర్‌ కొల్లి, సంగీతం: శాంతి సూర్యమ్‌, కొరియోగ్రఫీ: శ్రీను.ఎమ్‌, నిర్మాణం: అవతార్‌ మెహర్‌బాబా క్రియేషన్స్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: యర్రం వెంకటరెడ్డి, సహ నిర్మాతలు: డా॥జి.వి.ఎస్‌.ఆర్‌ కుమార్‌, విష్ణు లక్ష్మీ నారాయణ, పి.శ్రీధర్‌, రచన`దర్శకత్వం: అర్జున్‌ ప్రవాస్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ