Advertisementt

మళ్లీ వెండితెరపై కనిపించనున్న సుధాకర్‌..!!

Mon 08th Jun 2015 06:46 AM
sudhaker,on screen,vadu nenu kadu,health  మళ్లీ వెండితెరపై కనిపించనున్న సుధాకర్‌..!!
మళ్లీ వెండితెరపై కనిపించనున్న సుధాకర్‌..!!
Advertisement
Ads by CJ

సుధాకర్‌ వెండితెరపై కనిపిస్తే చాలు.. నవ్వుల వర్షం కురిసేది. అలాంటి సుధాకర్‌ చాన్నాళ్లుగా వెండితెరకు దూరమయ్యాడు. ఆయన ఎక్కడ ఉన్నారు..? ఏమి చేస్తున్నారు..? తదితర విషయాలు కూడా బయటకు రాకపోవడంతో ప్రేక్షకులు ఆవేదన చెందారు. అయితే కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడిన సుధాకర్‌ మళ్లీ కోలుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి సినిమాల్లో కనిపించడానికి ఆయన సిద్ధమవుతున్నాడు.

అటు హీరోగా ఇటు కమెడియన్‌గా కూడా సుధాకర్‌ ప్రేక్షకులను అలరించాడు. 90వ దశకంలో ఆయన లేకుండా సినిమాలు రావడం చాలా అరుదుగా ఉండేది. తనదైన డైలాగ్‌ డెలవరీలో నవ్వుల పువ్వులు పూయించేవారు సుధాకర్‌. ఇక చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ సుధాకర్‌ సినిమాల్లో కనిపించనున్నాడు. పూరిజగన్నాథ్‌ తమ్ముడు సాయి శంకర్‌ హీరోగా తెరకెక్కుతున్న 'వాడు నేను కాదు' సినిమాలో సుధాకర్‌ నటిస్తున్నాడు. మరి ఈ కొత్త ఇన్నింగ్స్‌లో సుధాకర్‌ గతంలా మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడా అన్నది వేచిచూడాల్సిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ