Advertisementt

ఇక ఆగేది లేదంటున్న నారా రోహిత్‌..!!

Sun 07th Jun 2015 07:16 AM
nara rohith,asura,appatlu okkadu undevadu,new film,start  ఇక ఆగేది లేదంటున్న నారా రోహిత్‌..!!
ఇక ఆగేది లేదంటున్న నారా రోహిత్‌..!!
Advertisement
Ads by CJ

అసుర విజయంతో మంచి ఊపుమీదున్నాడు నారా రోహిత్‌. ఆ సినిమా విడుదలై హిట్‌టాక్‌ తెచ్చుకున్న రెండో రోజుల్లోనే ఆయన మరో సినిమా మొదలుపెట్టాడు. ఈసారి నిజ జీవతం కథాంశంగా తీసుకున్న చిత్రంలో నారా రోహిత్‌ నటిస్తున్నారు. జూన్‌ 7వ తేదీ ఉదయం ఈ సినిమా ప్రారంభోత్సవ పూజ జరుపుకుంది.

బాణం, సోలో, ప్రతినిధి, రౌడీఫెల్లోలాంటి చిత్రాలతో నారా రోహిత్‌ మంచి అభిరుచి ఉన్న హీరోగా పేరు పొందాడు. అటు మాస్‌ ఆడియన్స్‌తోపాటు క్లాస్‌ ఆడియన్స్‌ను కూడా ఆయన ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా నారా రోహిత్‌ ప్రారంభించిన చిత్రానికి 'అప్పట్లో ఒకడుండే వాడు' అనే టైటిట్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు సాగర్‌ చంద్ర దర్శకత్వం వహించనున్నారు. సాగర్‌ చంద్ర ఇంతకుముందు 'అయ్యారే' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌' ఫేం శ్రీవిష్ణు ఈ సినిమాలో మరో కీలకపాత్రలో నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ సెట్స్‌పైకి వెళ్లనుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ