Advertisementt

'సాహసం సేయరా' డింభకా ట్రైలర్ లాంఛ్

Sun 07th Jun 2015 07:15 AM
sahasam cheyara dimbhaka audio launch,prince,jyothy seth,jyothi,sahasam cheyara dimbhaka   'సాహసం సేయరా' డింభకా ట్రైలర్ లాంఛ్
'సాహసం సేయరా' డింభకా ట్రైలర్ లాంఛ్
Advertisement
Ads by CJ

హంస వాహిని టాకీస్‌ బ్యానర్‌పై శ్రీ, హమీద, సమత హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘సాహసం సేయరా డిరభకా’. తిరుమల శెట్టి కిరణ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎమ్‌.ఎస్‌.రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది. ఎస్‌.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి బ్యానర్‌లోగోను ఆవిష్కరించారు. వి.సముద్ర, డి.ఎస్‌.రావు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. బెల్లంకొండ సురేష్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో...
ఎస్‌.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘‘ఇప్పుడు విడుదలవుతున్న సినిమాలు చూస్తుంటే ప్రేక్షకుల అభిరుచి మారుతుందని తెలుస్తుంది. చేస్తున్న ప్రయోగాలకు కొంత కామెడిని జతచేసి విజయాన్ని సాధిస్తున్నారు. హీరో శ్రీ కూడా మంచి సక్సెస్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. తనకి ఈ సినిమాతో మంచి సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు. 
అచ్చిరెడ్డి మాట్లాడుతూ ‘‘సక్సెస్‌ఫుల్‌ సినిమాలోని టైటిల్‌ను ఈ సినిమాకి పెట్టడం బావుంది. మంచి టైటిల్‌ను ఎంచుకున్నారు. ట్రైలర్‌ బావుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. 
సుముద్ర మాట్లాడుతూ ‘‘ఈ సినిమా దర్శక, నిర్మాతలు నాకు మంచి స్నేహితులు. సినిమాని నేను చూశాను. కచ్చితంగా పెద్ద హిట్‌ సాధించి లాభాలు తెచ్చిపెడుతుంది. ట్రైలర్‌ బావుంది. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది’’ అన్నారు.
బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో వచ్చిన ముని, గంగ సినిమాల్లాగానే ఈ సినిమా కూడా పెద్ద విజయాన్ని అందుకోవాలి’’ అన్నారు.
హీరో శ్రీ మాట్లాడుతూ ‘‘ఈ కథ వినగానే కిరణ్‌ని నువ్వే డైరెక్ట్‌ చేయాలని చెప్పాను. అనుకున్నట్లే తను సూపర్‌గా డైరెక్ట్‌ చేశాడు. సినిమా ముందే మేం సాహసం చేస్తున్నామని తెలుసు. అందుకే సాహసం సేయరా అనే టైటిల్‌ పెట్టాం. ఏడాదిన్నర తర్వాత నేను నటించిన సినిమా. కచ్చితంగా సక్సెస్‌ సాధిస్తుంది’’ అన్నారు.  
దర్శకుడు తిరుమల శెట్టి కిరణ్‌ మాట్లాడుతూ ‘‘నాపై నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్‌. సినిమా హండ్రెండ్‌ పర్సంట్‌ హిట్టవుతుంది’’ అన్నారు. 
నిర్మాత ఎమ్‌.ఎస్‌.రెడ్డి మాట్లాడుతూ ‘‘దర్శకుడిలోని టాలెంట్‌ నాకు తెలుసు. అందుకే తనకి దర్శకుడిగా అవకాశం ఇచ్చాను. తను ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సినిమాని బాగా డైరెక్ట్‌ చేశాడు. శ్రీవసంత్‌ మంచి ట్యూన్స్‌, బ్యాగ్రౌండ్‌స్కోర్‌ ఇచ్చాడు’’ అన్నారు. 

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ