Advertisementt

ప్రేక్షకులకు ‘సంజీవని’ లాంటి చిత్రం ఇది..!

Sat 06th Jun 2015 02:33 PM
sanjeevani,sanjeevani movie details,ravi vyde director,g nivaas,producer,sanjeevani movie shooting details  ప్రేక్షకులకు ‘సంజీవని’ లాంటి చిత్రం ఇది..!
ప్రేక్షకులకు ‘సంజీవని’ లాంటి చిత్రం ఇది..!
Advertisement
Ads by CJ

'Sanjeevani' in 1st Schedule

 As new talent is coming in, unique concepts, new genres and fantastic themes are being introduced to Tollywood audiences. One such film is “Sanjeevani”, which has been progressing with its shoot in various unexplored locations in India. It’s an Adventure Fantasy Thriller being directed by debutant Ravi Vide. As per the director, the film transports the audiences into a new fantasy and mysterious world with strange animals and supernatural events. In order to achieve that, the makers are taking extreme care on each frame of the film. CG work is going in parallel with the shoot.

Anurag Dev, Manoj Chandra and Swetaa Varma are the lead cast. Venk Reddy is doing Cinematography while KK Sravan is providing the music. G.Nivas is producing the film under the banner Nivas Creations.

మొదటి షెడ్యూల్‌లో ‘సంజీవని’

నివాస్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌లో అనురాగ్‌దేవ్‌, మనోజ్‌ చంద్ర, శ్వేతావర్మ ముఖ్య తారాగణంగా అమృత సమర్పిస్తున్న చిత్రం ‘సంజీవని’. రవి వీడేని దర్శకునిగా పరిచయం చేస్తూ జి. నివాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకుంటుంది. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవి వీడే చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘అత్యుత్తమ సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న చిత్రం ‘సంజీవని’. ఆంధ్ర, తెలంగాణ, కేరళ, ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాలలో మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతుంది. షూటింగ్‌ ప్రారంభించే ముందే ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఎనిమిది మందికి పర్వతారోహనలో శిక్షణ ఇప్పించడం జరిగింది. మా నిర్మాత జి. నివాస్‌ మంచి అవుట్‌పుట్‌ కోసం ఖర్చు విషయంలో మాకు చాలా స్వేఛ్చను ఇచ్చారు. ఈ చిత్రంతో ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తారు. ప్రేక్షకులకు నిజంగానే ఈ చిత్రం సంజీవనిలా అనిపిస్తుంది. జూలై నుండి ఆగస్ట్‌ వరకు హిమాలయా పర్వతాలలో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్‌ ముగుస్తుంది. షూటింగ్‌తో పాటుగానే కెనడాలో గ్రాఫిక్స్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తాము..’ అని అన్నారు. 

అనురాగ్‌దేవ్‌ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మనోజ్‌ చంద్ర, శ్వేతావర్మ మొదలగు వారు ముఖ్య తారాగణం. 

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంక్‌ రెడ్డి, సంగీతం: కె.కె. శ్రవణ్‌, సమర్పణ: అమృత, నిర్మాత: జి. నివాస్‌, దర్శకత్వం: రవి వీడే

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ