రైటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి డైరెక్టర్లుగా మారిన వారు దాసరి నారాయణరావు నుంచి మొదలుకొని ఎంతో మంది వున్నారు. స్టార్ రైటర్‌గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ నువ్వే నువ్వే చిత్రంతో డైరెక్టర్‌గా మారి చాలా సినిమాలు డైరెక్ట్ చేశాడు. అతని తర్వాత సంపత్ నంది, కొరటాల శివ, అనిల్ రావిపూడి, బాబీ వంటి రైటర్స్ డైరెక్టర్స్‌గా మారి సూపర్‌హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు అదే కోవలో మరో రైటర్ శ్రీధర్ సీపాన డైరెక్టర్‌గా మారుతున్నాడు. అహ నా పెళ్ళంటతో స్టార్ట్ అయి ఎన్నో సినిమాలకు కథ, మాటలు అందించిన శ్రీధర్ సీపాన ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. భవ్య క్రియేషన్స్ బేనర్‌లో వి.ఆనందప్రసాద్ నిర్మించబోయే చిత్రానికి శ్రీధర్ దర్శకుడు. మ్యాన్లీ లుక్ కోసం సిక్స్ ప్యాక్ వర్కవుట్ చేస్తున్న బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌ని ఈ సినిమాకి మొదట హీరోగా అనుకున్నాడు శ్రీధర్. అయితే ఇప్పుడు అతనితో చేస్తాడో లేక మరొకరిని ట్రై చేస్తాడో తెలీదుగానీ ఈ సినిమాతో శ్రీధర్ సీపాన దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు.