Advertisementt

'భవ్యక్రియేషన్స్' వారి చిత్రం ప్రారంభం..!

Sat 06th Jun 2015 03:42 AM
bhavya creations,gopichand,ravikumar chowdary,anandprasad  'భవ్యక్రియేషన్స్' వారి చిత్రం ప్రారంభం..!
'భవ్యక్రియేషన్స్' వారి చిత్రం ప్రారంభం..!
Advertisement
Ads by CJ

గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా 'భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్6' చిత్రం ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్ లో జరిగింది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి శ్రీదర్ సీపాన క్లాప్ ను ఇవ్వగా, నిర్మాత ఆనంద్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి మాట్లాడుతూ "నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారికి ఈ సందర్భంగా పాదాభివందదనాలు తెలుపుతున్నాను. నా మొదటి సినిమా అవకాశం ఆయనే ఇచ్చారు. ఆనంద్ ప్రసాద్, గోపీచంద్ లతో మరోసారి పని చేయడం ఆనందంగా ఉంది. ప్రసాద్ మూరెళ్ళ గారితో ఎప్పటినుండో వర్క్ చేయాలనుకున్నాను. ఈ సినిమాతో ఆయనతో వర్క్ చేసే అవకాశం వచ్చింది. శ్రీధర్ సీపాన మంచి స్టొరీ ఇచ్చారు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ చిత్రమిది. జూలై మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. ఈ చిత్రం పిల్లా నువ్వులేని జీవితం, లౌక్యం సినిమాల కంటే పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను" అని చెప్పారు.

గోపీచంద్ మాట్లాడుతూ "శ్రీధర్ సీపాన లౌక్యం తరువాత మరో మంచి కథ చెప్పారు. నా కెరీర్ లో 'యజ్ఞం' లాంటి హిట్ ఇచ్చిన రవికుమార్ గారితో మరోసారి వర్క్ చేయడం ఆనందంగా ఉంది" అని తెలిపారు.

ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ "శ్రీధర్ సీపాన మాతో ట్రావెల్ చేస్తూ 2014లో పెద్ద హిట్ ఇచ్చారు. ఈ సినిమాకు కూడా మంచి కథను ఇచ్చారు. వీలైనంత క్వాలిటీతో ఈ చిత్రాన్ని అధ్బుతంగా తెరకెక్కిస్తాను. ప్రసాద్ మూరెళ్ళ ఎంత పెద్ద టెక్నీషియనో అందరికి తెలిసిందే. శ్రీధర్ సీపాన అతి త్వరలో దర్శకుడిగా మా బ్యానర్ లో పరిచయం కానున్నాడు" అని చెప్పారు.

శ్రీధర్ సీపాన మాట్లాడుతూ "ఇదొక కొత్త లైన్. రొటీన్ వాటికి భిన్నంగా ఉంటుంది. గోపీచంద్ గారికి ఈ స్టొరీ కరెక్ట్ గా సూట్ అవుతుంది. లౌక్యం సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. దానికి కొనసాగింపుగా ఈ చిత్రం ఉంటుంది" అని చెప్పారు.

ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్, ఎడిటర్: గౌతంరాజు, కథ-మాటలు: శ్రీధర్ సీపాన, స్క్రీన్ ప్లే: కోనవెంకట్, గోపీమోహన్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ