Advertisementt

'ధనలక్ష్మి తలుపు తడితే' ఆడియో లాంచ్..!

Sat 06th Jun 2015 03:38 AM
dhanalaksmi thalupu thadithe,dhanaraj,ramasathyanarayana,bhole savali  'ధనలక్ష్మి తలుపు తడితే' ఆడియో లాంచ్..!
'ధనలక్ష్మి తలుపు తడితే' ఆడియో లాంచ్..!
Advertisement

మాస్టర్‌ సుక్కురామ్‌ సమర్పణలో భీమవరం టాకీస్‌ పతాకంపై అవుట్‌ అండ్‌ అవుట్‌ హిలేరియస్‌ ఎంటర్‌టైనింగ్‌ థ్రిల్లర్‌ నిర్మిస్తున్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ.  ఆ చిత్రం పేరు ‘ధనలక్ష్మి తలుపు తడితే..!!’ సాయి అచ్యుత్‌ చిన్నారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనరాజ్‌, మనోజ్‌నందం, రణధీర్‌, అనిల్‌ కళ్యాణ్‌, విజయ్‌సాయి, సింధుతులాని, శ్రీముఖి, నాగబాబు, తాగుబోతు రమేష్‌, రచ్చరవి, షేకింగ్‌ శేషు మరియు జబర్దస్త్‌ బ్యాచ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో జరిగింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ థియేట్రికల్ ట్రైలర్ ను, బిగ్‌ సీడీని ఆవిష్కరించారు. హీరో తనీష్ ఆడియో సిడిలను విడుదల చేసారు. భోలో సావలి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో మాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది.

ఈ సందర్భంగా తలసానిశ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ "ఈ చిత్ర బృందానికి నా అభినందనలు. సినిమా ఇండస్ట్రీకి యంగ్ స్టర్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధనరాజ్ నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలి. మా సపోర్ట్ ఎప్పుడు సినీ ఇండస్ట్రీకి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇండియాలోనే అతి పెద్ద చలన  చిత్ర పరిశ్రమగా హైదరాబాద్ అభివృద్ధి పరచే దిశలో ప్రణాళిక చేస్తుంది" అని అన్నారు.

తనీష్ మాట్లాడుతూ "ఈ సినిమాలో నేనొక స్పెషల్ సాంగ్ లో నటించడానికి కారణం ధనరాజ్. ఓ సన్నివేశంలో కూడా నటించాను. ఈ చిత్రంలో నేను కూడా భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

దర్శకుడు సాయి అచ్యుత్ చిన్నారి మాట్లాడుతూ "ఈ సినిమాను చాలా బాధ్యతతో తీశాను. సినిమా చూసినవారికి మంచి అనుభూతి కలుగుతుంది. ఇదొక విలన్ జర్నీ సినిమా. భోలే మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు" అని చెప్పారు.

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ "సినిమా స్క్రిప్ట్ చాలా బావుంది. చిన్న సినిమాగా మొదలు పెట్టినా క్వాలిటీ విషయంలో పెద్ద చిత్రంగా తీసాం. ఈ చిత్రానికి పని చేసిన వాళ్ళంతా దానం కోసం కాకుండా ధనరాజ్ పట్ల ప్రేమాభిమానాలతో నటించారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నాం" అని తెలిపారు.

ధనరాజ్ మాట్లాడుతూ "అచ్యుత్ గారితో 'సచ్చినోడి ప్రేమకథ' అనే చిత్రాన్ని మొదలు పెట్టాం కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. మరలా ఆయన ఈ సినిమా స్టొరీ వినిపించారు. చాలా నచ్చింది అందుకే ప్రొడక్షన్ లో కూడా భాగస్తుడినయ్యాను. ఈ సినిమాలో చాలా మంది నేను అడిగిన వెంటనే ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారు. ఈ సినిమాకి కథే హీరో. భోలే మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

భోలే సావలి మాట్లాడుతూ "ధనరాజ్, రామసత్యనారాయణ, సాయి అచ్యుత్ చిన్నారి త్రిముర్తుల్లా ఈ చిత్రాన్ని రూపొందించారు. కనకాధర స్తోత్రం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా చేయడానికి కొంచెం హోమ్ వర్క్ చేసాను. సాయి అచ్యుత్ మంచి కథను సిద్ధం చేసుకున్నాడు, నా నుంచి మ్యూజిక్ కూడా రాబట్టుకున్నాడు." అని చెప్పారు.

సి.కళ్యాన్ మాట్లాడుతూ "సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. ధనలక్ష్మి అందరి తలుపులు తడుతుంది" అని చెప్పారు.

కోదండరామిరెడ్డి మాట్లాడుతూ "మ్యూజిక్ చాలా బావుంది. సినిమా కూడా మంచి సక్సెస్ సాధించి అందరికి లాబాలు తెచ్చిపెట్టాలి" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, కొడాలి వెంకటేశ్వరావు, సునీల్ కుమార్, రేలంగి నరసింహారావు, ప్రథాని రామకృష్ణ గౌడ్, బెక్కం వేణుగోపాల్, మల్కాపురం శివ కుమార్, నవీన్ యాదవ్, జబర్దస్త్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌: శివ వై.ప్రసాద్‌, కెమెరామెన్‌: జి.శివకుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: ప్రసాద్‌ మల్లు (యుఎస్‌ఎ)`ప్రతాప్‌ భీమిరెడ్డి (యుఎస్‌ఎ), సమర్పణ: మాస్టర్‌ సుక్కురామ్‌, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్‌ప్లే-సంభాషణలు-దర్శకత్వం: సాయి అచ్యుత్‌ చిన్నారి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement