Advertisementt

'కేరింత'కు క్లీన్ 'యు' సర్టిఫికెట్‌..!

Sat 06th Jun 2015 03:32 AM
kerintha,june 12th release,sensor clean certificate,dil raju  'కేరింత'కు క్లీన్ 'యు' సర్టిఫికెట్‌..!
'కేరింత'కు క్లీన్ 'యు' సర్టిఫికెట్‌..!
Advertisement
Ads by CJ
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా 'కేరింత'. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ "కేరింత' చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. సెన్సార్‌ పూర్తయిన అనంతరం సెన్సార్‌ సభ్యులు సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. ఇటీవల విడుదలయిన ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నిజమైన స్నేహం, ప్రేమ అంశాలతో సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రాన్ని జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: మిక్కి జె మేయర్, సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి,  దర్శకుడు: సాయికిరణ్ అడవి, నిర్మాత: దిల్ రాజు. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ