Advertisementt

జూలై నుండి అమెరికాలో ‘శ్రీకారం’!

Fri 05th Jun 2015 06:53 AM
srikaaram,srikaaram movie opening matter,p ravikumar,raj emandi,america,srikaaram movie  జూలై నుండి అమెరికాలో ‘శ్రీకారం’!
జూలై నుండి అమెరికాలో ‘శ్రీకారం’!
Advertisement
Ads by CJ

Raj Emandi who is the producer for this movie is settled in Tampa, Florida, U.S.A. for the past 25 years.  Being an industrialist and international business man as a passion he is also involved briefly in the entertainment business and recently involved with introducing a new pop singer MIZGIN to the world and already released the first song both audio and video and selling very good.  He is also producing a 90 minutes 3D animated movie under titles GOVINDUDU an mythological entertainment movie focusing mostly the children.  This movie is under production now.  His aim on making this film SRIKARM is totally keeping in mind of Indians living abroad and how much they put their effort to raise keep up with their traditions and values and how much effort they put to influence their children towards Indian culture and in the same time to show how caring and understanding most of the Americans (foreigners) are when it comes to their traditions and values and at the same time how much they respect other religions and traditions.

యాక్‌మే యానిమేషన్స్‌ బ్యానర్‌పై,  గత 25 సంవత్సరాలుగా యుఎస్‌ఎ లో ఇండస్ట్రీయలిస్ట్‌ మరియు ఇంటర్నేషనల్‌ బిజినెస్‌మ్యాన్‌గా విజయపధంలో దూసుకుపోతున్న రాజ్‌ ఈమండి నిర్మాతగా, నంది అవార్డ్‌ గ్రహీత పి. రవికుమార్‌ దర్శకత్వంలో ప్రముఖ హీరో, హీరోయిన్లతో జూలై నుండి ‘శ్రీకారం’ అనే చిత్రం రూపుదిద్దుకోనుంది. 

ఈ సందర్భంగా నిర్మాత రాజ్‌ ఈమండి మాట్లాడుతూ..‘రీసెంట్‌గా ‘మిజిన్‌’ అనే పాప్‌ సింగర్‌ని పరిచయం చేస్తూ..మేము రూపొందించిన ఆడియో అండ్‌ వీడియో ఆల్బమ్‌ మంచి సక్సెస్‌ని సాధించి మార్కెట్‌లో రికార్డ్‌ సేల్స్‌ని సాధించింది.  తాజాగా మా నుండి రాబోతున్న ఈ ‘శ్రీకారం’ చిత్రం కూడా ప్రేక్షకుల్ని అందర్నీ మెప్పిస్తుందని ఆశిస్తున్నాము. ఈ మూవీ గురించి చెప్పాలంటే..భారతీయ సాంప్రదాయ విలువల గొప్పతనం గురించి తెలిపే మంచి కథతో ‘శ్రీకారం’ తెరకెక్కనుంది. ఇది స్వచ్ఛమైన, సాంప్రదాయమైన ప్రేమకథ. ఇండియా, అమెరికాల మధ్య జరుగుతున్న పెళ్ళిళ్లు, ఆ పెళ్ళిళ్ళ తర్వాత పుట్టే వారి జీవిత విధానాల గురించి తెలిపే చక్కని మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రమిది. నంది అవార్డ్‌ గ్రహీత పి. రవికుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటి సారిగా లైవ్‌ సౌండ్‌ రికార్డింగ్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం స్క్రిఫ్ట్‌ వర్క్‌ పూర్తయింది. జూలై నుండి రెగ్యూలర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. 90 పర్సెంట్‌ మూవీ అమెరికాలోనే తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నటించే తారాగణం, సాంకేతిక నిపుణుల గురించి అతి త్వరలో తెలియజేస్తాము..’ అని తెలిపారు.   

ఈ చిత్రానికి కథ-నిర్మాత: రాజ్‌ ఈమండి

స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పి. రవికుమార్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ