క్రిస్ ప్రాట్, బ్రిస్ డల్లాస్ హోవార్డ్ ప్రాధాన పాత్రల్లో కోలిన్ ట్రెవోరో దర్శకత్వంలో ఫ్రాంక్ మార్షల్, పాట్రిక్ క్రోలి సంయుక్తంగా నిర్మించిన హాలీవుడ్ సినిమా 'జురాసిక్ వరల్డ్'. ఈ చిత్రాన్ని ఆంగ్ల భాషలోనే భారతదేశంలో ప్రదర్శింపజేసే హక్కులను ముకేష్ మెహతా సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. అనతరం ముకేష్ మెహతా మాట్లాడుతూ "1993లో జురాసిక్ పార్క్ అనే సినిమా వచ్చింది. దాదాపు 22 సంవత్సరాల తరువాత దానికి సీక్వెల్ గా 'జురాసిక్ వరల్డ్' చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రముఖ దర్శకుడు కోలిన్ ట్రెవోరో. యాక్షన్, అడ్వెంచర్స్ తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. జూన్ 11న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇండియాలో మొత్తం 2500 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. రీసెంట్ గా విడుదలయిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియాస్ చిత్రాన్ని ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేసారో ఈ చిత్రాన్ని కూడా వారే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమా ఇది. ఖచ్చితంగా ఈ చిత్రం100 కోట్ల కలెక్షన్లను సాధిస్తుంది" అని తెలిపారు.