Advertisement

'వాడు నేను కాదు' సినిమా ప్రారంభం..!

Fri 05th Jun 2015 03:39 AM
vadu nenu kadu,ram shankar,mahima nambiyar,vinod vijayan,ravipaccha mutthu  'వాడు నేను కాదు' సినిమా ప్రారంభం..!
'వాడు నేను కాదు' సినిమా ప్రారంభం..!
Advertisement

రామ్ శంకర్, మహిమా నంబియార్ జంటగా వినోద్ విజయన్ దర్శకత్వంలో రవిపచ్చముత్తు నిర్మిస్తున్న  సినిమా 'వాడు నేను కాదు'. ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీచక్రం సమక్షంలో ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్ లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో గురువారం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రవిపచ్చముత్తు క్లాప్ ను ఇవ్వగా, రామ్ జెట్మలాని కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఎ.ఎమ్.రత్నం మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా 

దర్శకుడు వినోద్ విజయన్ మాట్లాడుతూ "ఇదొక ప్యూర్ లవ్ స్టొరీ. ఇందులో రామ్ శంకర్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. సినిమాలో ఆరు పాటలు ఉంటాయి. రేపటి నుండి(జూన్ 5) సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. హైదరాబాద్, బెంగుళూరు, తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించనున్నాం" అని చెప్పారు. 

నిర్మాత రవిపచ్చముత్తు మాట్లాడుతూ "ఆరుగురు నేషనల్ అవార్డు విన్నర్స్ ఈ సినిమాలో పని చేయడం ఆనదంగా ఉంది. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

రామ్ శంకర్ మాట్లాడుతూ "ఓ కొత్త కథతో ఈ సినిమా ఐదు భాషలలో ఓపెనింగ్ కార్యక్రమం జరుపుకొంది. నేషనల్ అవార్డు విన్నర్స్ ఈ సినిమాలో పని చేస్తున్నారు. ఇంత మంది గొప్ప టెక్నీషియన్స్ పని చేస్తున్న సినిమాలో నాకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంతో నాకు మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

మహిమా నంబియార్ మాట్లాడుతూ "తెలుగులో ఇది నా మొదటి సినిమా. తమిళంలో ఏడు సినిమాలో నటించాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు" అని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ "ఓ మై ఫ్రెండ్ సినిమా తరువాత నేను చేస్తున్న మరో సినిమా ఇది. కామెడీ, సెంటిమెంట్స్ తో పాటు అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రామ్ జెట్మలాని, నవీన్ యాదవ్, మాగంటి గోపీనాథ్, పూరిజగన్నాథ్, తేజ, సత్యం శ్రీరంగం, ఆదిత్య మెహతా, రాజీవ్ రవి, పట్నం షా, సి.రోహన్ రెడ్డి, సుమన్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్: రవిపచ్చముత్తు, కె.మోహనన్, వినోద్ విజయన్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, ప్రొడ్యూసర్: వినోద్ విజయన్, మ్యూజిక్ డైరెక్టర్: రాహుల్ రాజ్, ఎడిటర్: వివేక్ హర్షన్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement