‘మొహబ్బతేఁ’ చిత్రంలో షమితా శెట్టి ఫ్రెండ్ క్యారెక్టర్ చెయ్యడం ద్వారా నటిగా పరిచయమైన సింధు తులాని తెలుగులో ‘ఐతే’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంటర్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసినప్పటికీ తెలుగులోనే హీరోయిన్‌గా ఎక్కువ అవకాశాలు వచ్చాయి. నందమూరి కళ్యాణ్‌రామ్‌తో చేసిన ‘అతనొక్కడే’ ఆమెకు హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగులో 30కి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, ముఖ్యపాత్రల్లో నటించి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు తగ్గి కొన్ని ప్రాధాన్యత వున్న క్యారెక్టర్స్ చేసిన సింధు ఆమధ్య పెళ్ళి చేసుకుంది. సాధారణంగా హీరోయిన్లు పెళ్ళి చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారు. కానీ, సింధు తులాని మాత్రం అంత గ్యాప్ తీసుకోకుండా వదిన, అక్క వంటి క్యారెక్టర్లు చెయ్యడానికి రెడీ అయిపోయింది. లేటెస్ట్‌గా ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో వదిన క్యారెక్టర్ ద్వారా అందర్నీ అలరించిన సింధు రాబోయే చిత్రాల్లో ‘ధనలక్ష్మీ తలుపు తడితే’ చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన క్యారెక్టర్‌లో నటిస్తోంది. తను బాలీవుడ్ నుంచి వచ్చిన తను తమిళ్, కన్నడలో ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేశానని, తనను ఎక్కువ ఆదరించింది తెలుగు చిత్ర పరిశ్రమేనని, అందుకే ఇకపై తెలుగులో అన్ని రకాల క్యారెక్టర్లు చెయ్యడానికి తాను సిద్ధంగా వున్నానని చెప్తోంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో చేసిన క్యారెక్టర్ అందరికీ బాగా నచ్చిందని, దాంతో అవకాశాలు కూడా వస్తున్నాయని చెప్తోంది సింధు తులాని. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ అయిన సింధు తులాని ఇంకా ముందు ముందు మంచి క్యారెక్టర్స్ చేసి అందర్నీ అలరిస్తుందని ఆశిద్దాం.